Headlines

ఇసుక మాఫియా పై అధికారులు దాడులు

*అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు – రెండు లారీలు స్వాధీనం, ఎఫ్ఐఆర్‌లు నమోదు*

విశాలాంధ్ర – కొవ్వూరు : జిల్లా గనులు మరియు భూగర్భ శాఖాధికారి  డి. ఫణిభూషణ రెడ్డి, రాజమహేంద్రవరం, ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారి ఆంజనేయులు, తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో  సిబ్బందితో కలిసి 30.10.2025న కొవ్వూరు మరియు వాడపల్లి గ్రామాలలో నిర్వహించిన తనిఖీలలో AP39WD 3566 మరియు AP39UX 4579 వాహనాలు సరైన పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. సదరు వాహనాలను కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద భద్రపరచడమైనది. తదుపరి పరిశీలనలో, సబ్-కలెక్టర్, కల్లూరు డివిజన్, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారు లేఖ సంఖ్య Rc.No.A/1107/2025, తేదీ 08.10.2025 ద్వారా సంచాలకులు, గనులు మరియు భూగర్భశాఖ, ఇబ్రహీంపట్నం వారికి పై వాహనాలు గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి పరిధి గుండా అక్రమ ఇసుక రవాణా చేసిన కేసుల్లో పట్టుబడినట్లు, జరిమానాలు విధించబడి ఎఫ్ఐఆర్‌లు నమోదు అయినట్లు తెలియజేశారు. ఇందునిమిత్తం, సంచాలకులు, గనులు మరియు భూగర్భశాఖ, ఇబ్రహీంపట్నం వారు APSMS పోర్టల్‌లో వాహనాలను బ్లాక్ చేసినప్పటికీ, సంబంధిత యజమానులు తిరిగి బిల్లు లేకుండా అక్రమ రవాణా చేసినట్లు గుర్తించబడింది. ఈ నేపథ్యంలో, నిబంధనలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించినందున, జిల్లా గనులు మరియు భూగర్భ శాఖాధికారి, రాజమహేంద్రవరం వారు 31.10.2025 తేదీన కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో పై రెండు వాహనాలపై క్రిమినల్ చర్యల నిమిత్తం ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయించారు. ఇకపై ఇసుక అక్రమ రవాణాలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు మరియు భూగర్భ శాఖాధికారి హెచ్చరించారు.

The post ఇసుక మాఫియా పై అధికారులు దాడులు appeared first on Visalaandhra.

​*అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు – రెండు లారీలు స్వాధీనం, ఎఫ్ఐఆర్‌లు నమోదు* విశాలాంధ్ర – కొవ్వూరు : జిల్లా గనులు మరియు భూగర్భ శాఖాధికారి  డి. ఫణిభూషణ రెడ్డి, రాజమహేంద్రవరం, ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారి ఆంజనేయులు, తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో  సిబ్బందితో కలిసి 30.10.2025న కొవ్వూరు మరియు వాడపల్లి గ్రామాలలో నిర్వహించిన తనిఖీలలో AP39WD 3566 మరియు AP39UX 4579 వాహనాలు సరైన పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. సదరు
The post ఇసుక మాఫియా పై అధికారులు దాడులు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *