విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అని, ఆమె బ్యాంకులను జాతీయం చేసి గొప్ప సంస్కరణలు చేశారని, ఇది ఆమె గొప్పతనమని , ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పంచ సూత్రాలు భారతదేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టి.కే. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా శుక్రవారం నాడు ఉదయం స్థానిక సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ (వాటర్ ట్యాంక్ ల పార్క్) లో ఉన్న శ్రీమతి ఇందిరా గాంధీ గారి విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టి.కే. విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచం గుర్తించిన అతి గొప్ప రాజకీయవేత్త ఇందిరా గాంధీ అన్నారు. పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ భారతదేశ ప్రధానిగా ఉండి 20 సూత్రాలు, బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హటావోలతో భారతదేశం అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ బత్తిన చందర్రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీర్రాజు, దంటు వీర వెంకట్రావు, తిరుపతి శ్రీను, వెదురుపాక శ్రీను, శ్రీకాకుళపు వెంకటరమణ, నారాయణపురపు సతీష్, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
The post గొప్ప రాజనీతిజ్ఞురాలు ఇందిరా గాంధీ appeared first on Visalaandhra.
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అని, ఆమె బ్యాంకులను జాతీయం చేసి గొప్ప సంస్కరణలు చేశారని, ఇది ఆమె గొప్పతనమని , ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పంచ సూత్రాలు భారతదేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టి.కే. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా శుక్రవారం నాడు ఉదయం స్థానిక
The post గొప్ప రాజనీతిజ్ఞురాలు ఇందిరా గాంధీ appeared first on Visalaandhra.
