– రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి
విశాలాంధ్ర – రాజానగరం : రాష్ట్రంలోని ప్రజలకు సేవలందించడంతో పాటు అర్హులైన ప్రతిఒక్కరికి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఫలాలు అందించడమే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రుడా ఛైర్మన్, నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకట రమణ చౌదరి అన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం అందించే పింఛన్లు పంపిణీలో భాగంగా మండలం లోని దివాన్ చెరువు గ్రామంలో శనివారం రుడా ఛైర్మన్ పాల్గొన్నారు.దీనిలో భాగంగా లబ్ధిదారులు ఇండ్లకు స్వయంగా ఆయనే తిరుగుతూ పింఛన్లు సొమ్ములు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని చెప్పారు. ప్రతి అర్హుడికి సమయానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కందుల బాబు రాయుడు, నిడదవోలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బత్తుల నాగేశ్వరరావు(నాగు),బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వంక మల్లిఖార్జున స్వామి, టిఎన్టియుసి జిల్లా అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాస్,జనసేన గ్రామ అధ్యక్షులు యర్రంశెట్టి శ్రీను,కూటమి నాయకులు కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, తదితరులు
పాల్గొన్నారు.
The post ప్రజా సేవే ప్రభుత్వ ధ్యేయం appeared first on Visalaandhra.
– రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి విశాలాంధ్ర – రాజానగరం : రాష్ట్రంలోని ప్రజలకు సేవలందించడంతో పాటు అర్హులైన ప్రతిఒక్కరికి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఫలాలు అందించడమే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రుడా ఛైర్మన్, నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకట రమణ చౌదరి అన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం అందించే పింఛన్లు పంపిణీలో భాగంగా మండలం లోని దివాన్ చెరువు గ్రామంలో శనివారం రుడా ఛైర్మన్ పాల్గొన్నారు.దీనిలో భాగంగా లబ్ధిదారులు ఇండ్లకు స్వయంగా
The post ప్రజా సేవే ప్రభుత్వ ధ్యేయం appeared first on Visalaandhra.
