Headlines

వాలీ బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎంపిక

విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ తన ప్రతిభతో వాలీ బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎస్ కే అజీమ ఎంపిక అయ్యింది. మండలంలో వెదుళ్లపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్ కే అజీమ శుక్రవారం అనపర్తి బలుల పాఠశాలలో జరిగిన అండర్ 17 పోటీలలో విజయం సాధించి శనివారం కొవ్వూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు హరహత సాధించింది అని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ వి వి సత్యనారాయణ తెలిపారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన పాఠశాల పి డి పి చింతాలబ్బాయి కి అభినందనలు తెలిపారు. అలగే విజయం సాధించిన విద్యార్థిని అజీమకు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించాలని ఆశీర్వదించారు. 

The post వాలీ బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎంపిక appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ తన ప్రతిభతో వాలీ బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎస్ కే అజీమ ఎంపిక అయ్యింది. మండలంలో వెదుళ్లపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్ కే అజీమ శుక్రవారం అనపర్తి బలుల పాఠశాలలో జరిగిన అండర్ 17 పోటీలలో విజయం సాధించి శనివారం కొవ్వూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు హరహత సాధించింది అని
The post వాలీ బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎంపిక appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *