Headlines

సీఎం సహాయ నిధి

సీఎం సహాయ నిధి చెక్కులతో పేదలకు ఆర్ధిక బరోసా 

విశాలాంధ్ర – సీతానగరం: సీఎం సహాయ నిధి చెక్కులు ద్వారా పేదలకు ఆర్ధిక బరోసా కలుగుతుంది అని జనసేన పార్టీ నా సేన నా వంతు రాష్ట్ర కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అన్నారు. గురువారం మండలంలో చినకొండేపూడి, ముగ్గుళ్ళ, రాజంపేట, మునుకూడలి, సింగవరం గ్రామాల్లోసుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి బత్తుల వెంకటలక్ష్మి స్వయంగా అందచేశారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫార్సు మేరకు లబ్ధిదారులకు చెక్కులు అందచేయడం జరిగింది అని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం నిమిత్తం కుటుంబాలు ఆర్ధికంగా నష్ట పోకుండా ఈ సీఎం సహాయ నిధి చెక్కులు అండగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కాండ్రు శేఖర్, మట్టా వెంకటేశ్వరరావు, 

తొర్రిగడ్డ వైస్ చైర్మన్ జగపతి రాజు, కొనే శ్రీను, కోసూరి త్రిమూర్తులు రాజు, మట్టా కాపు, సురేష్,  కతా సత్యనారాయణ మొదలగు కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 

The post సీఎం సహాయ నిధి appeared first on Visalaandhra.

​సీఎం సహాయ నిధి చెక్కులతో పేదలకు ఆర్ధిక బరోసా  విశాలాంధ్ర – సీతానగరం: సీఎం సహాయ నిధి చెక్కులు ద్వారా పేదలకు ఆర్ధిక బరోసా కలుగుతుంది అని జనసేన పార్టీ నా సేన నా వంతు రాష్ట్ర కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అన్నారు. గురువారం మండలంలో చినకొండేపూడి, ముగ్గుళ్ళ, రాజంపేట, మునుకూడలి, సింగవరం గ్రామాల్లోసుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి బత్తుల వెంకటలక్ష్మి స్వయంగా అందచేశారు.
The post సీఎం సహాయ నిధి appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *