ఎన్‌జిఆర్‌ఐ ఆధ్వర్యంలో సర్వే
అత్యాధునిక పరికరాల వినియోగం
9 కిలోమీటర్ల మేర టన్నెల్
భూగర్భంలో పరిస్థితులపై అధ్యయనం
తవ్వకం పూర్తయితే ఆవిష్కృతం కానున్న ఇంజినీరింగ్ అద్భుతం
ఎస్‌ఎల్‌బిసిని 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎస్.ఎల్.బి.సి టన్నెల్‌కు సంబంధించిన హెలీ బోర్న్ ఎలెక్ట్రో మాగ్నటిక్ సర్వేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శా ఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి లాంఛనప్రాయంగా సోమవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్ర త్యక్షంగా పర్యవేక్షించేందుకు హెలికాప్టర్‌లో ఎస్‌ఎల్‌బిసి వద్దకు వెళ్లనున్నా రు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ (ఎఎంఆర్‌పి) 1983లో ప్రారంభమైంది. ఇది నల్గొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు నీరందించడంతో పాటు ఆ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించే లక్షంగా దీనిని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌కు కృష్ణా నది నుంచి 3 టిఎంసిల నీటిని వినియోగించుకోనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన ఎస్‌ఎల్‌బిసి టన్నెల్-1 43.93 కి.మీ. పొడవుతో శ్రీశైలం జలాశయం ఎడమ గట్టు నుండి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు శ్రీశైలం వైపు నుంచి 13.94 కి.మీ, దేవరకొండ వైపు నుంచి 20.4 కి.మీ. వరకు తవ్వకం పూర్తయింది. ఇంకా సుమారు 9.8 కి.మీ. తవ్వకాలు జరపాల్సి ఉంది. ఈ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే పొడవైన టన్నెల్‌గా, అలాగే, ప్రపంచ ఇంజినీరింగ్ చరిత్రలో ఒక విశిష్ట రికార్డు సృష్టించనుంది.
టన్నెల్ నిర్మాణానికి అనేక సవాళ్లు..
ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ మార్గం అత్యంత క్లిష్టమైంది. ఇది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని కొండలు, గుట్టల మీదుగా క్వార్ట్, గ్రానైట్ రాయి పొరలను చీల్చుతూ, అలాగే 15 చిన్న వాగులు, -అందులో 4 సజీవ ప్రవాహాలు కూడా – దాటాల్సి ఉంది. ఇలాంటి ఎన్నో అవాంతరాలు ఉండటం తో దీనిని రెండు చివరల నుంచే తవ్వకాలు కొనసాగనున్నాయి. ఈ టన్నెల్ నిర్మాణానికి భౌతిక, సాంకేతిక, సమస్యలు ఎదురు కావడంతో దీనిని ఎత్తిపోతల విధానంలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకుగానూ ఏడాదికి రూ.500 కోట్లకు పైగా విద్యుత్ వ్యయంపైనే కానుంది. ఈ వ్యయాన్ని అధిగమించడానికి టన్నెల్ పూర్తి కాగానే గ్రావిటీ ద్వారా నీటిని తీసుకెళ్లడం ద్వారా ఈ భారీ వ్యయం ఆదా అవ్వనుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచే అనేక అవాంతరాలను, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్టోబర్ 2009లో వచ్చిన భారీ వరదలు వల్ల టన్నెల్ బోరింగ్ యంత్రం (టిబిఎం) నీట మునగడం, అలాగే. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్నెల్ తవ్వకానికి వినియోగించిన యంత్రం పైకప్పు కూలడం వల్ల అది ఇసుక, రాళ్ల మిశ్రమంలో కూరుకుపోవడం వల్ల ఇందులో చిక్కుకుని ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ పరిణామం అనంతరం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ శాస్త్రీయ పర్యవేక్షణతో ఆధునిక తవ్వక విధానాలు అవలంబించాలని సిఫార్సు చేసింది. దీనిని అక్టోబర్ 23న జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి, 2028 డిసెంబర్ నాటికి టన్నెల్ పనులు పూరి ్తచేయాలని లక్షంగా పెట్టుకుంది. టన్నెల్ నిర్మాణ నిపుణుల సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) ఆధ్వర్యంలో మాగ్నటిక్ జియోఫిజికల్ సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి లాంఛనప్రాయంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం చేపట్టాడానికి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయి రాక్ మెకానిక్స్, టన్నెల్ నిపుణులతో కూడిన సాంకేతిక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ (రిటైర్డ్) ని ప్రత్యేక సలహాదారుగా, అలాగే కల్నల్ పరక్షిత్ మెహ్రాని ఒక సంవత్సరానికి ప్రాజెక్ట్ నిపుణుడిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ టన్నెల్ పూర్తి అయిన తర్వాత, అది ప్రపంచ టన్నెల్ నిర్మాణ చరిత్రలో దేశానికే గర్వకారణంగా నిలవ నుందని చెబుతున్నారు.
ఎన్‌జిఆర్‌ఐ ఆధ్వర్యంలో సర్వే
అత్యాధునిక పరికరాల వినియోగం
9 కిలోమీటర్ల మేర టన్నెల్
భూగర్భంలో పరిస్థితులపై అధ్యయనం
తవ్వకం పూర్తయితే ఆవిష్కృతం కానున్న ఇంజినీరింగ్ అద్భుతం ఎస్‌ఎల్‌బిసిని 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంమన తెలంగాణ/హైదరాబాద్: ఎస్.ఎల్.బి.సి టన్నెల్‌కు సంబంధించిన హెలీ బోర్న్ ఎలెక్ట్రో మాగ్నటిక్ సర్వేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శా ఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి లాంఛనప్రాయంగా సోమవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్ర త్యక్షంగా పర్యవేక్షించేందుకు హెలికాప్టర్‌లో ఎస్‌ఎల్‌బిసి వద్దకు వెళ్లనున్నా రు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ (ఎఎంఆర్‌పి) 1983లో ప్రారంభమైంది. ఇది నల్గొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు నీరందించడంతో పాటు ఆ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించే లక్షంగా దీనిని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌కు కృష్ణా నది నుంచి 3 టిఎంసిల నీటిని వినియోగించుకోనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన ఎస్‌ఎల్‌బిసి టన్నెల్-1 43.93 కి.మీ. పొడవుతో శ్రీశైలం జలాశయం ఎడమ గట్టు నుండి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు శ్రీశైలం వైపు నుంచి 13.94 కి.మీ, దేవరకొండ వైపు నుంచి 20.4 కి.మీ. వరకు తవ్వకం పూర్తయింది. ఇంకా సుమారు 9.8 కి.మీ. తవ్వకాలు జరపాల్సి ఉంది. ఈ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే పొడవైన టన్నెల్‌గా, అలాగే, ప్రపంచ ఇంజినీరింగ్ చరిత్రలో ఒక విశిష్ట రికార్డు సృష్టించనుంది.టన్నెల్ నిర్మాణానికి అనేక సవాళ్లు..