Headlines

Peddhi: ‘పెద్ది’ నుండి చికిరిచికిరి సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే ట్యూన్‌తో హైప్ పెంచిన ప్రోమో

Ram Charan Peddhi Chikiri Song Release Date

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ “పెద్ది” నుంచి ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫస్ట్‌ సాంగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. మేకర్స్‌ ఒక బిగ్‌ సర్‌ప్రైజ్‌గా ‘చికిరి’ అంటూ సాగే ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈరోజు (నవంబర్‌ 5) విడుదల చేసిన ప్రోమో వీడియోలో సాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ట్యూన్‌ తో పాటు రామ్‌ చరణ్‌ యొక్క ఎనర్జిటిక్‌ హుక్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. “చికిరి” పాటను ..

Also Read : Aamir Khan: రోజుకు వంద పాన్లు తిన్న ఆమిర్‌ ఖాన్‌.. కారణం వింటే షాక్ అవుతారు!

నవంబర్‌ 7న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్టు టీమ్‌ ప్రకటించింది. ఈ సినిమాకి ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. అయితే ఇక పాట గురించి వీడియోలో దర్శకుడు బుచ్చిబాబు సానా, ఇంకా రెహమాన్ మాట్లాడుకోగా.. పెద్ది గాడు (రామ్‌ చరణ్‌) తన గ్రామంలో హీరోయిన్‌ (జాన్వీ కపూర్‌)ను మొదటిసారి చూసే సందర్భంలో ఈ పాట వస్తుందట. ఆ క్షణంలో హీరో మనసులో కలిగిన భావాలను పదాల్లో మార్చినట్టుగా “కాటుక అక్కర్లేని కళ్లు, ముక్కుపుడక అక్కర్లేని ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరిరా ఈ చికిరి” అనే లైన్ లో రావాలి అంటూ బుచ్చిబాబు వివరణ ఇవ్వగా.

రెహమాన్‌ ఈ లైన్‌ విన్న వెంటనే “చికిరి అంటే ఏమిటి?” అని అడిగితే, బుచ్చిబాబు “మా ఊరిలో ముద్దుగా, అందంగా ఉన్న అమ్మాయిని ‘చికిరి’ అని పిలుస్తారు” అని చెప్పారు. అప్పుడు రెహమాన్‌ అదే పదం మీద సాంగ్‌ చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రోమో చివరలో రామ్‌ చరణ్‌ నోటిలో బీడీతో చేసే మాస్‌ హుక్‌ స్టెప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఒక్క సీన్‌ చూసిన ఫ్యాన్స్‌ “ఇదే చరణ్‌ స్టైల్‌!” అంటూ ఫిదా అవుతున్నారు. పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు సెట్‌ చేయగా.. తాజాగా విడుదలైన సాంగ్ అప్ డేట్ మరింత బజ్‌ తెచ్చింది.

​మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ “పెద్ది” నుంచి ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫస్ట్‌ సాంగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. మేకర్స్‌ ఒక బిగ్‌ సర్‌ప్రైజ్‌గా ‘చికిరి’ అంటూ సాగే ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈరోజు (నవంబర్‌ 5) విడుదల చేసిన ప్రోమో వీడియోలో సాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ట్యూన్‌ తో పాటు రామ్‌ చరణ్‌ యొక్క ఎనర్జిటిక్‌ హుక్‌  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *