కళాత్మకమైన నృత్య ప్రదర్శన తో చూపారుల హృదయాలను కట్టి పడేసిన “చిరంజీవి అభి”
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : చిన్నతనం నుండే తన తల్లి దండ్రుల అభిరుచి మేరకు , గురువర్యులు శ్రీ శివ సాయి కూచిపూడి కళా క్షేత్రం నిర్వహికురాలు కళా తపశ్వి శ్రీమతి తణుకు సాయి మాదవి శిక్షణలో జాతీయ స్థాయిలో జరిగిన కూచిపూడి పోటిల్లో అభి తన ప్రతిభను నిరూపించుకుంది .. అభి గృహంలో ఎటు చూసినా తను సాధించిన మెమోంటోలు , సరిఫికెట్లు , మెడల్స్ స్వాగతం పలుకుతుంటాయి . ఇంటికి వచ్చిన అతిదులు సాక్షాత్తు ఆ నటరాజ స్వామి నీ నృత్యంలో కనపడుతుంటాడమ్మా అంటు పలువురు పెద్దలు దీవిస్తు కితాబులతో అభిని ఆనంద పరచటం చిరంజీవి అభిలో ఒకరకమైన కొత్త ఉత్సాహం ఇస్తుంది . అభి మాటల్లో నా ప్రతిభ , నాలో నాట్యం శ్రీమతి సాయి మాదవి శ్రమ కృషికి తర్కాణం అని చెప్పటం విశేషం .. సీతానగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసి చిరంజీవి అభి తన ప్రతిభను నిరూపించుకుంది . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేద్రంగా శ్రీ శివ సాయి కూచిపూడి కళా క్షేత్రం నిర్వహించడం సాహితీ నగరంగా చారిత్రిక పేరు గాంచిన రాజమంద్రి మరో చరిత్రకు పునాది అవుతుందని పలువురు ప్రశంసలు కురిపించారు .. చిరంజీవి అభిని కూచిపూడి నాట్యంలో పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు సి హెచ్ వెంకట్ , భవానీ లను పలువురు గురువులు, పెద్దలు మెచ్చుకున్నారు . అభి కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వేషదారణిలో సాక్షాత్తు శ్రీ వారి సన్నిధిని మెప్పించినట్టుగా వుంది . అభి తోపాటుగా విభిన్న పాత్రాలు పోషించి వారి నృత్య ప్రదర్శనతో అందరిని మెప్పించిన తోటి కూచిపూడి నృత్య కారిణిలు వారి ప్రతిభను ఎంతో గొప్పగా చాటుకున్నారు ..చిరంజీవి అభి హిందూ ధర్మానికి ప్రతీకగా కూచిపూడి నాట్యం పట్ల ఆకర్షింపబడటం రామాయణ , మహాభారత పవిత్ర గ్రందాలను మెప్పించినట్లేనని , చిన్నతనం నుండి పిల్లల్లో హిందూ ధర్మ విలువలను, కూచిపూడి నాట్యం గొప్పతనాన్ని పిల్లలకు తెలియచేసే విధంగా పాఠశాలల్లో ప్రభుత్వాలు ప్రోత్సహించాలి . శ్రీ శివ సాయి కూచిపూడి కళా క్షత్రాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి . ఇప్పటికే శ్రీమతి సాయి మాదవి సారథ్యంలో జాతీయ స్థాయిలోను , ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక పోటిల్లో గోల్డ్ మెడల్స్ , ప్రతిష్టాత్మకమైన మెమోంటోలు , సర్టిఫికెట్స్ సాధించిన ఖ్యాతి సాయి మాదవి సొంతం . చిరంజీవి అభి తో పాటుగా ఎంతో మాది కూచిపూడి విద్యార్థులు శ్రీ శివ సాయి కూచిపూడి కళా క్షేత్రంలో వున్నారు అని చెప్పుకోవటానికి ఎంతో గర్వాంగా వుంటుందని కొందరు ప్రముఖులు సాయి మాదవి ని ప్రశంసలతో మురిపించారు ..
The post నృత్య ప్రదర్శన తో అభి appeared first on Visalaandhra.
కళాత్మకమైన నృత్య ప్రదర్శన తో చూపారుల హృదయాలను కట్టి పడేసిన “చిరంజీవి అభి” విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : చిన్నతనం నుండే తన తల్లి దండ్రుల అభిరుచి మేరకు , గురువర్యులు శ్రీ శివ సాయి కూచిపూడి కళా క్షేత్రం నిర్వహికురాలు కళా తపశ్వి శ్రీమతి తణుకు సాయి మాదవి శిక్షణలో జాతీయ స్థాయిలో జరిగిన కూచిపూడి పోటిల్లో అభి తన ప్రతిభను నిరూపించుకుంది .. అభి గృహంలో ఎటు చూసినా తను సాధించిన మెమోంటోలు ,
The post నృత్య ప్రదర్శన తో అభి appeared first on Visalaandhra.
