మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు.
విశాలాంధ్ర – కడియం : రేషన్ డీలర్స్ కు ప్రస్తుతం ఇచ్చే ఒక రూపాయి కమిషన్ షాపు నిర్వహణకే సరిపోతుందని తూర్పుగోదావరి జిల్లా రేషన్ డీలర్స్ అధ్యక్షులు రాజు అన్నారు. రేషన్ డీలర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని, డీలర్స్ తో త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారని, త్వరలోనే కమిషన్ పెంచుతామని తెలిపారన్నారు. 65 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులకు, వికలాంగులకు 100 శాతం రేషన్ పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని తెలిపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పృధ్వీరాజు, వాకపల్లి సూరిబాబు, కొండలరావు, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
The post మంత్రి దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు appeared first on Visalaandhra.
మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు. విశాలాంధ్ర – కడియం : రేషన్ డీలర్స్ కు ప్రస్తుతం ఇచ్చే ఒక రూపాయి కమిషన్ షాపు నిర్వహణకే సరిపోతుందని తూర్పుగోదావరి జిల్లా రేషన్ డీలర్స్ అధ్యక్షులు రాజు అన్నారు. రేషన్ డీలర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని, డీలర్స్ తో త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారని, త్వరలోనే
The post మంత్రి దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు appeared first on Visalaandhra.
