Headlines

కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం

విశాలాంధ్ర – దేవరపల్లి : కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని పార్టీ అభ్యర్థులు ఎంపిక పదవులు కేటాయింపులో డిసిసి అధ్యక్షుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని ఏఏసిసి కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా పరిశీలకులు అంబా ప్రసాద్ పేర్కొన్నారు దేవరపల్లి మండలం దుద్దుకూరులో రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కాకర్ల శ్రీహరిబాబు స్వగృహం వద్ద గోపాలపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అంబా ప్రసాదు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి ఎంతో ఘన చరిత్ర ఉందని క్రమశిక్షణ కలిగిన జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ భారత దేశ ప్రజలకు విశేష సేవలు అందిస్తుంది అన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థగతంగా మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు డిసిసి అధ్యక్షులు ఎంపిక విషయంలో కార్యకర్తలకు వారి అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అంబా ప్రసాద్ వెల్లడించారు రాబోవు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని దేశంలో అన్ని రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు అసెంబ్లీ లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ తీసుకొని వారి అభిప్రాయాలకు ప్రాధాన్య చేస్తామని కార్యకర్తల అభిప్రాయాలను కేంద్ర అధిష్టాన వర్గానికి తీసుకెళ్తామని అంబా ప్రసాద్ వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లాలలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని రాజమండ్రి గోపాలపురం నియోజకవర్గం లో సమావేశాలు నిర్వహించామని మిగిలిన ఐదు నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు ఏసీసీ కార్యదర్శి మిస్ అంబా ప్రసాద్ రాష్ట్ర ఇంచార్జ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అదితాలకు దుద్దుకూరులో కాకర్ల శ్రీహరిబాబు స్వగృహం వద్ద భారీ స్థాయిలో స్వాగతం లభించింది సమావేశానికి ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అబ్జర్వర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎం బాబ్జి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తే తల వెంకట విశ్వేశ్వర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు గోపాలపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మార్టిన్ లూథరన్ ఉపాధ్యక్షుడు మరియు డిసిసి మాజీ ఉపాధ్యక్షుడు ఎండి రఫీ ఉల్లా బే రఫీ ఉల్లా బిగ్ ఏఐసీసీ సభ్యురాలు అమర్ జహా బేగం దేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాక చిన్నబ్బాయి రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కాకర్ల శ్రీ హరిబాబు కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి వెలగా రామకృష్ణ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం శారద ఎస్ లలిత నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడవరపు భద్రం దొర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలకుర్తి ప్రభాకర్ చౌదరి వేగివాడ సత్యనారాయణ సుంకర సత్యనారాయణ జేటి రామకృష్ణ డాక్టర్ వడయార్ విల్లూరి రమేష్ దాసరి కుటుంబరావు జొన్నలగడ్డ సుబ్బారాయుడు వెంకట సుబ్బారాయుడు అనంతరం ఏఐసీసీ కార్యదర్శి రాష్ట్ర పరిశీలకులు అంబా ప్రసాద్కు అదితను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు

The post కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – దేవరపల్లి : కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని పార్టీ అభ్యర్థులు ఎంపిక పదవులు కేటాయింపులో డిసిసి అధ్యక్షుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని ఏఏసిసి కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా పరిశీలకులు అంబా ప్రసాద్ పేర్కొన్నారు దేవరపల్లి మండలం దుద్దుకూరులో రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కాకర్ల శ్రీహరిబాబు స్వగృహం వద్ద గోపాలపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన
The post కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *