Headlines

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం చైతన్య నగర్  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యయిని మధిర వెంకట కృష్ణ కామేశ్వరి మాట్లాడుతూ అందరం రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని మనం తెచ్చుకున్న రాజ్యాంగాన్ని కాపాడుకుని అనుక్షణం ఆచరణలో చూపడం మన తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రవేశికను ప్రతిజ్ఞ చేయించారు. జన విజ్ఞాన వేదిక మండల గౌరవ అధ్యక్షులు గండి స్వామి ప్రసాద్, పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు పెరవలి యేసు బాబు, ఉపాధ్యాయిని లంక కాశీ అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రపంచంలోనే రాజ్యాంగాలన్నిటిలో భారత లిఖిత రాజ్యాంగం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని పేర్కొన్నారు. అనంతరం  వ్యాసరచన చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. 8వ తరగతి విద్యార్థి పెదపూడి మహిమ రాజు అంబేద్కర్ మహనీయుని వేషధారణలో ఆకట్టుకున్నాడు.

The post ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – కడియం : కడియం మండలం చైతన్య నగర్  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యయిని మధిర వెంకట కృష్ణ కామేశ్వరి మాట్లాడుతూ అందరం రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని మనం తెచ్చుకున్న రాజ్యాంగాన్ని కాపాడుకుని అనుక్షణం ఆచరణలో చూపడం మన తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రవేశికను ప్రతిజ్ఞ చేయించారు. జన విజ్ఞాన వేదిక మండల గౌరవ అధ్యక్షులు గండి స్వామి ప్రసాద్, పండిత
The post ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *