Headlines

భావితరాలకు దిక్సూచి

భారత రాజ్యాంగం భావితరాలకు దిక్సూచి వంటిది 

విశాలాంధ్ర – గోపాలపురం : భారత రాజ్యాంగం భావితరాలకు దిక్సూచి వంటిదని ఎంపీడీవో జి. రాజ్ మనోహర్ పేర్కొన్నారు. బుధవారం 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా జరుపుకున్నారు. మండల పరిషత్ కార్యాలయము నందు ఎంపీడీవో రాజ్ మనోహర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ సాంబశివరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశ్రమ పాఠశాల నందు ప్రిన్సిపాల్ నాగ తోట సుజని విద్యార్థిని విద్యార్థులచే రాజ్యాంగాన్ని గూర్చి వివరించి అనంతరం మాకు అసెంబ్లీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ 26.11.1949 వ తేదీన ఆమోదించబడిన రాజ్యాంగమును భారతీయులు అందరు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. జనవరి 26.1950 నుండి అమలు లోకి వచ్చిన రాజ్యాంగాన్ని అందరూ అనుసరిస్తూ క్రమ బద్ధమైన రాజ్యాంగం అడుగుజాడలలో నడవాలి అని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందనీ ఉద్యోగులు,ప్రజల అందరి చేత భారత రాజ్యాంగ ప్రవేశిక ను ఆమోదిస్తునట్లు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెదేప మండల పార్టీ అధ్యక్షుడు కొర్లపాటి రాము, తెదేప సీనియర్ నాయకులు జేష్ట శ్రీధర్, మాజీ ఎంపీటీసీ కూనపం ప్రసాద్ బాబు,రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ సాంబ శివరావు, ఏ ఎస్ ఓ జోడాల వెంకట్, కార్యదర్శులు, రెవిన్యూ అధికారులు కాసింసేన్, మురళి, కార్యాలకు సిబ్బంది పాల్గొన్నారు.

The post భావితరాలకు దిక్సూచి appeared first on Visalaandhra.

​భారత రాజ్యాంగం భావితరాలకు దిక్సూచి వంటిది  విశాలాంధ్ర – గోపాలపురం : భారత రాజ్యాంగం భావితరాలకు దిక్సూచి వంటిదని ఎంపీడీవో జి. రాజ్ మనోహర్ పేర్కొన్నారు. బుధవారం 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా జరుపుకున్నారు. మండల పరిషత్ కార్యాలయము నందు ఎంపీడీవో రాజ్ మనోహర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ సాంబశివరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
The post భావితరాలకు దిక్సూచి appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *