Headlines

ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ దేశంలోనే ప్రత్యేకం

ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లు
సీఎం పర్యటన ఏర్పాట్ల సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
2న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-పాల్వంచ
ఎర్త్‌సైన్స్‌ యూనివర్సిటీ దేశంలోనే ప్రత్యేకత కలిగినదని వ్యవసాయ, సహకార మార్కెటింగ్‌, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌సైన్స్‌ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఈనెల 2న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వస్తున్న సందర్భంగా ఆ ఏర్పాట్లను ఆదివారం మంత్రి పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణాన్ని పర్యవేక్షించి, పనుల పురోగతిని తెలుసుకున్నారు. సభాస్థలాన్ని సందర్శించారు. తరువాత యూనివర్సిటీ ఆడిటోరియంలో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. భూగోళ శాస్త్రాలు, సహజ వనరులు, ఖనిజ పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా నిలిచే విధంగా దేశంలోనే ప్రత్యేకత కలిగిన ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపారు.

గతంలో సింగరేణి నిర్వహించిన ‘స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌’ అనుభవాన్ని గుర్తుచేస్తూ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ స్థాపనకు చేసిన కృషి గురించి వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక యూనివర్సిటీ అవసరాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గుర్తించి వెంటనే ఆమోదం తెలపడంతో ఈ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుందని చెప్పారు. కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సూచనలతో రూపొందించిన ప్రతిపాదనను ప్రభుత్వం నిపుణులతో పరిశీలించి, అసెంబ్లీలో ప్రకటించిందని మంత్రి వివరించారు. కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ సంపద లభ్యమయ్యే ప్రాంతంగా ఉండటంతో ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ స్థాపనకు అత్యుత్తమ ప్రదేశమైందని తెలిపారు. దేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడై పదేండ్లు ప్రధానిగా పనిచేసిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ సేవలను గౌరవిస్తూ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, మంత్రివర్గం, అసెంబ్లీ దీనిని ఆమోదించాయని వివరించారు.

పాల్వంచలో గడువు పూర్తయిన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను తొలగించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పర్యావరణహిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి సీఎం ఆమోదం తెలిపినట్టు తెలిపారు. కొత్తగూడెం బైపాస్‌ రహదారి కోసం రూ.420 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌లో భాగంగా డిస్ట్రిబ్యూటర్‌ కెనాల్స్‌ నిర్మాణానికి అవసరమైన రూ.3400 కోట్ల నిధులకు ముఖ్యమంత్రి ఆమోదించినట్టు వెల్లడించారు. భద్రాచలం – మణుగూరు – ఏటూరునాగారం – చౌటాల రహదారి నిర్మాణం కోసం అటవీ శాఖ రెండు లైన్ల రహదారికి అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఖమ్మం కేంద్రంగా సూర్యాపేట – రాజమహేంద్రవరం – నాగపూర్‌ – అమరావతి రహదారులు పూర్తి కానున్నాయన్నారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఎస్పీ రోహిత్‌ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్‌, అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

The post ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ దేశంలోనే ప్రత్యేకం appeared first on Navatelangana.

​ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లుసీఎం పర్యటన ఏర్పాట్ల సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు2న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవతెలంగాణ-పాల్వంచఎర్త్‌సైన్స్‌ యూనివర్సిటీ దేశంలోనే ప్రత్యేకత కలిగినదని వ్యవసాయ, సహకార మార్కెటింగ్‌, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌సైన్స్‌ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఈనెల 2న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వస్తున్న సందర్భంగా ఆ ఏర్పాట్లను ఆదివారం మంత్రి పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణాన్ని పర్యవేక్షించి, పనుల
The post ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ దేశంలోనే ప్రత్యేకం appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *