Headlines

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

నలుగురు మృతి.. పలువురికి గాయాలు
క్షతగాత్రుల్లో చిన్నారులూ

వాషింగ్టన్‌ : గన్‌కల్చర్‌కు మారుపేరైన అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలో గల స్టాక్‌టన్‌లో శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడినట్టు శాన్‌ జోక్విన్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్టు వివరించింది. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు తెలిపింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వివరించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

The post కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం appeared first on Navatelangana.

​నలుగురు మృతి.. పలువురికి గాయాలుక్షతగాత్రుల్లో చిన్నారులూ వాషింగ్టన్‌ : గన్‌కల్చర్‌కు మారుపేరైన అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలో గల స్టాక్‌టన్‌లో శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడినట్టు శాన్‌ జోక్విన్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్టు వివరించింది. క్షతగాత్రుల్లో చిన్నారులు
The post కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *