Headlines

నిక్కచ్చిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు

సర్పంచ్ ఎన్నికలలో ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవు
స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి
సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ను కఠినంగా అమలు చేయడంతో పాటు,ప్రలోభాలను నివారించేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి  తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ..సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామాల్లో అభ్యర్థులు,వారి అనుచరులు డబ్బు పంచడం,ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం,కుల సంఘాలకు డబ్బు పంచడం,గ్రామ అభివృద్ధి పేరుతో డబ్బులు అడగడం,ఆశాచూపడం వంటి చర్యలపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

ప్రజలు భయభ్రాంతులు లేకుండా, స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా  జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా,శాంతియుత వాతావరణంలో జరిగేలా జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు, మండలాల వారిగా ఎఫ్ ఎస్ టి బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం ఎన్నికలపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.

The post నిక్కచ్చిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు appeared first on Navatelangana.

​సర్పంచ్ ఎన్నికలలో ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవుస్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలిసిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారినవతెలంగాణ – రాజన్న సిరిసిల్లసర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ను కఠినంగా అమలు చేయడంతో పాటు,ప్రలోభాలను నివారించేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి  తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ..సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామాల్లో అభ్యర్థులు,వారి అనుచరులు డబ్బు పంచడం,ఓటర్లను ప్రలోభాలకు
The post నిక్కచ్చిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *