Headlines

పరీక్ష

పుట్టిన క్షణం
ఆడో మగో నన్న చూపుల పరీక్ష
ముడుచుకోలేని ఆత్మగౌరవం
మీ అయ్య పేరేమి…
మీ అమ్మ పేరేమి…
అడిగిన ప్రశ్నలకు
డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ధ్రువపత్రాన్ని చూయించి
మొదటి అడ్మిషన్‌
పరీక్ష పాస్‌ అయితి
ఫెయిలా పాసా అన్న ప్రశ్నలకు
ఫీజు డ్యూ లిస్ట్‌లో మొదటి పేరు
నా నాన్న స్థితికి ఓ పరీక్ష
టీచర్‌ అవ్వాలని చదివి రాసి
ఉద్యోగం తెచ్చుకుని
ఏండ్ల సంది వేల మందికి
సదువు చెప్పినా
నీవు అసలు పంతులువేనా…
TET బరిలో తేల్చుకోమనే
రిటైర్డ్‌ వయసులో
యవ్వనపు కండరం
ఎక్కడనుండి తెచ్చుకోను
ఇప్పుడు దింపుడు కళ్ళెం టెస్టుకు
తయారవాల్సిందే…
ఎలుకను పట్టి గోదావరి
ఈద మంటుండు
దారి ఇంటికో… కాటికో…
చివరి శిక్ష పాస్‌ కావలెనట
శంఖులో పోస్తేనేతీర్థ మైనట్టు
TET పాస్‌ ఐతేనే
పంతులువి అన్నడు

  • వహీద్‌ ఖాన్‌

The post పరీక్ష appeared first on Navatelangana.

​పుట్టిన క్షణంఆడో మగో నన్న చూపుల పరీక్షముడుచుకోలేని ఆత్మగౌరవంమీ అయ్య పేరేమి…మీ అమ్మ పేరేమి…అడిగిన ప్రశ్నలకుడేట్‌ ఆఫ్‌ బర్త్‌ ధ్రువపత్రాన్ని చూయించిమొదటి అడ్మిషన్‌పరీక్ష పాస్‌ అయితిఫెయిలా పాసా అన్న ప్రశ్నలకుఫీజు డ్యూ లిస్ట్‌లో మొదటి పేరునా నాన్న స్థితికి ఓ పరీక్షటీచర్‌ అవ్వాలని చదివి రాసిఉద్యోగం తెచ్చుకునిఏండ్ల సంది వేల మందికిసదువు చెప్పినానీవు అసలు పంతులువేనా…TET బరిలో తేల్చుకోమనేరిటైర్డ్‌ వయసులోయవ్వనపు కండరంఎక్కడనుండి తెచ్చుకోనుఇప్పుడు దింపుడు కళ్ళెం టెస్టుకుతయారవాల్సిందే…ఎలుకను పట్టి గోదావరిఈద మంటుండుదారి ఇంటికో… కాటికో…చివరి శిక్ష పాస్‌
The post పరీక్ష appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *