Headlines

పవర్ కోచ్‌గా ఆండ్రీ రస్సెల్‌.. చరిత్రలో ఎప్పుడూలేని కొత్త రోల్‌.. పవర్ కోచ్ అంటే ఏంటి?

Andre Russell: ఐపీఎల్‌కు వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు సపోర్టింగ్‌ స్టాప్‌, పవర్‌ కోచ్‌గా మాత్రం సేవలు అందిస్తానని చెప్పాడు. పవర్ కోచ్ అనే పదం క్రికెట్‌ గురించి తెలిసిన వారికి కూడా కన్‌ఫ్యూజ్‌ చేస్తోంది. అసలు పవర్ కోచ్‌ అంటే ఏంటో చూద్దాం..

పవర్ కోచ్ అంటే ఏంటి?
పవర్ కోచ్ అంటే క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త పదవి అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై కేకేఈఆర్ నుంచి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అయితే పేరుని బట్టి చూస్తే, ఈ రోల్‌ బ్యాటర్లకు పవర్ హిట్టింగ్ నైపుణ్యాలు, స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌ చేసే స్కిల్స్‌ను నేర్పిస్తుందని అంటున్నారు. బ్యాటర్లు సిక్సర్లు కొట్టేలా శిక్షణ ఇవ్వడం పవర్ కోచ్ ప్రధాన కర్తవ్యం అని చెబుతున్నారు. (Andre Russell)

“పవర్ కోచ్” అనే పదం పవర్ హిట్టింగ్, స్ట్రెంగ్త్‌, ఎక్స్‌ప్లోజిల్‌ తరహా బ్యాటింగ్/బౌలింగ్‌ను సూచిస్తుంది. ఈ మేరకు ఆటగాళ్లకు శారీరక శక్తికి సంబంధించిన అంశాల్లో రస్సెల్ కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

బంతిని అత్యంత శక్తితో బౌండరీ వైపుగా కొట్టే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా ఆండ్రీ రస్సెల్‌కు ఎంతగా పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. పవర్ కోచ్‌గా ఆండ్రీ రస్సెల్‌ మజిల్, ఎనర్జీ, పవర్ గేమ్‌కు సంబంధించిన శిక్షణను ఇవ్వనున్నాడు. భారీ షాట్లు, ఫినిషింగ్ స్కిల్స్‌, ఒత్తిడిలో పవర్ హిట్టింగ్ చేయడంలో ఆటగాళ్లకు ఆండ్రీ రస్సెల్‌ సహాయపడతాడు.

Also Read: ఇండొనేషియాలో వరదలు.. 442 మంది మృతి.. ఇక శ్రీలంక, మలేషియా, థాయిలాండ్‌లోనైతే..

రస్సెల్ ఈ రోల్‌కు ఎలా సరిపోతాడు?
రస్సెల్ ఎక్స్‌ప్లోజివ్‌ బ్యాటింగ్ (భారీ సిక్సులు, మ్యాచ్ ఫినిషింగ్ ఇన్నింగ్స్), మ్యాచ్‌పై ప్రభావం చూపేలా బౌలింగ్, ఆల్‌రౌండ్ ఆటతీరుకు పెట్టింది పేరు. దీంతో అతడు ఈ కొత్త రోల్‌కు బాగా సరిపోతాడు. “నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఉండే పవర్, ఫీల్డ్‌లో బంతితో చూపించే ఎనర్జీ ఈ పవర్ కోచ్ పేరుకు సరిపోతుంది” అని రస్సెల్ స్వయంగా చెప్పాడు.

పవర్ కోచ్‌గా రస్సెల్ యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేస్తాడు. ముఖ్యంగా పవర్ హిట్టింగ్, శక్తిమంతమైన బ్యాటింగ్/బౌలింగ్, ఫీల్డింగ్, కీలక సందర్భాల్లో మైండ్‌సెట్‌పై శిక్షణ ఇస్తాడు. రస్సెల్ ఐపీఎల్‌లో ప్లేయర్‌గా రిటైర్ అయ్యాడు. కానీ 2026 సీజన్‌లో కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్‌లో మొదటి “పవర్ కోచ్”గా చేరుతున్నాడు.

ఆటగాళ్ల జట్టులో ఇక ఉండకపోయినా, బ్యాటింగ్ పవర్, లోయర్ ఆర్డర్ ఫినిషర్లు, ఎక్స్‌ప్లోజివ్‌ షాట్లు, బౌలింగ్ పవర్, శారీరక దృఢత్వం, ఫినిషింగ్ గేమ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తాడు.

ఐపీఎల్‌లో భవిష్యత్తులో ఇతర జట్లు కూడా మాజీ స్టార్‌ల అనుభవాన్ని బాగా ఉపయోగించుకునేలా.. కేకేఆర్‌ తీసుకున్న నిర్ణయం ఉంది. సాధారణ మెంటర్‌గా కాకుండా, నిర్దిష్ట అంశాల్లో ప్రత్యేక కోచ్‌గా రస్సెల్‌ను తీసుకోవాలన్న కేకేఆర్‌ నిర్ణయం ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

టీ20 క్రికెట్లో పవర్ హిట్టింగ్, ఫినిషింగ్ ఓవర్లు, భారీ షాట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో “పవర్ కోచ్” బ్యాటర్లను సిద్ధం చేస్తాడు. రస్సెల్ లాంటి ఆటగాళ్లకు టీమ్ కల్చర్, హై ప్రెషర్ మ్యాచ్‌ల గురించి బాగా తెలుసు. ఇటువంటి వారి కోచింగ్‌ వల్ల.. అధిక స్ట్రైక్ రేట్ బ్యాటింగ్, మిడిల్‌ ఓవర్ల ఆట, డెత్ ఓవర్ల బౌలింగ్, శారీరక దృఢత్వం, ఎక్స్‌ప్లోజివ్‌ ఫీల్డింగ్ వంటి నైపుణ్యాలు యువ ఆటగాళ్లలో పెరుగుతాయి.

​టీ20 క్రికెట్లో పవర్ హిట్టింగ్, ఫినిషింగ్ ఓవర్లు, భారీ షాట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ “పవర్ కోచ్” అందుకు తగ్గట్లు బ్యాటర్లను సిద్ధం చేస్తాడు. రస్సెల్ లాంటి ఆటగాళ్లకు టీమ్ కల్చర్, హై ప్రెషర్ మ్యాచ్‌ల గురించి బాగా తెలుసు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *