అధ్యక్షుడు రాజీనామా చేయాలని వామపక్షాల డిమాండ్
మద్దతుగా పాల్గొన్న రోమన్ కేథలిక్ మతాధికారులు
మనీలా : అవినీతికి వ్యతిరేకంగా నిరసనలతో ఫిలిప్పీన్స్ దద్దరిలింది. వామపక్షాల నాయకత్వంలో వేలాది మంది భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆదివారంనాడు దేశ రాజధాని మనీలాలో జరిగిన
ఈ ర్యాలీలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కుంభకోణంలో ప్రమేయం ఉన్న శాసన సభ్యులు, ఉన్నతాధికారులపై త్వరగా విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ద్వీప సమూహాల దేశమైన ఫిలిప్పీన్స్‌లో వరదలు, తుపాన్‌లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణమైతే వీటివల్ల జరిగే నష్టం కన్నా దానికి మించి వాటి పేరుతో జరిగే అవినీతి ప్రజలకు మరింత నష్టం చేస్తుంది. ఇలా అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. వరదలు, తీవ్రమైన తుపాన్‌ల సహాయక చర్యల పేరుతో నాసిరకం, లోపభూయిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టి కోట్ల రూపాయలను శాసన సభ్యులు, అధికారులు దండుకుంటున్నారని, అనేక ప్రాజెక్టులను ప్రకటించి వాటిలో భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆందోళనకారులు విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ అధ్యక్షులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
భారీగా పోలీసుల మోహరింపు
మనీలా మహానగరంలో ర్యాలీని అడ్డుకోవడానికి దాదాపు 17 వేలమంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. అడుగడుగునా అనేక ఆటంకాలు సృష్టించినా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజాస్వామ్య దేశమైన ఫిలిప్పీన్స్‌లో ఈ మధ్య కాలంలో దోపిడీ ఆరోపణలపై ఇద్దరు అధ్యక్షులు పూర్తిగా పదవీచ్యుతులయ్యారు. అయితే దేశంలో జరుగుతున్న ఉద్యమాలపై సైన్యం స్పందించింది. ”ఫిలిప్పీన్స్ సాయుధ దళాలు స్థిరత్వానికి స్తంభంగా, ప్రజాస్వామ్యానికి దృఢమైన సంరక్షకుడిగా ఉంటామని పునరుద్ఘాటిస్తున్నాం” అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న రోమన్ కాథలిక్ చర్చిలు ఆదివారం జరిగిన అవినీతి వ్యతిరేక నిరసనకు మద్దతు తెలిపాయి. చర్చి మతాధికారులు కూడా నిరసనలో పాల్గొన్నారనీ, చర్చిలకు సంబంధించిన వారు తెల్లటి దుస్తులు ధరించి దాదాపు 5 వేలమంది ప్రదర్శనలో భాగమయ్యారని పోలీసులు తెలిపారు.
The post ఫిలిప్పీన్స్‌లో అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు appeared first on Navatelangana.
అధ్యక్షుడు రాజీనామా చేయాలని వామపక్షాల డిమాండ్‌మద్దతుగా పాల్గొన్న రోమన్ కేథలిక్ మతాధికారులు మనీలా : అవినీతికి వ్యతిరేకంగా నిరసనలతో ఫిలిప్పీన్స్ దద్దరిలింది. వామపక్షాల నాయకత్వంలో వేలాది మంది భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆదివారంనాడు దేశ రాజధాని మనీలాలో జరిగినఈ ర్యాలీలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కుంభకోణంలో ప్రమేయం ఉన్న శాసన సభ్యులు, ఉన్నతాధికారులపై త్వరగా విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ద్వీప సమూహాల దేశమైన ఫిలిప్పీన్స్‌లో వరదలు, తుపాన్‌లు వంటి
The post ఫిలిప్పీన్స్‌లో అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు appeared first on Navatelangana.
