Headlines

బీఆర్‌ఎస్‌ గూటికి బీజేపీ నేతలు

ఆహ్వానించిన మాజీ మంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సర్పంచ్‌ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ముద్విన్‌ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజీ తేలేకపోయారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఇతర రాష్ట్రాలకు రూ. వేల కోట్లు ఇస్తుంటే మనకు గుండు సున్నా మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రం మనకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో, రాష్ట్ర హక్కులను కాపాడటంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా వీరి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు తోడు దొంగలని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ముద్విన్‌ గ్రామానికి చెందిన మారగోని నర్సింహతో పాటు సీనియర్‌ నాయకులు గురిగల మహేశ్‌, పట్నం శ్రీను, పట్నం నరేశ్‌, జీల శ్రీశైలం, దొడ్లపాటి నర్సింహ, మారమూని మల్లయ్య, గంగాపురం రాకేశ్‌ సహా పలువురు కార్యకర్తలు ఉన్నారు.

The post బీఆర్‌ఎస్‌ గూటికి బీజేపీ నేతలు appeared first on Navatelangana.

​ఆహ్వానించిన మాజీ మంత్రి హరీశ్‌రావు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సర్పంచ్‌ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ముద్విన్‌ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజీ
The post బీఆర్‌ఎస్‌ గూటికి బీజేపీ నేతలు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *