Headlines

మార్చురీ గదిని వాడుకలోకి తీసుకురావాలి: ఎమ్మార్పీఎస్

నవతెలంగాణ-పాలకుర్తి
ప్రభుత్వాసుపత్రిలో నిర్మించిన మార్చురీ గదిని వాడుకలోకి తీసుకువచ్చి గ్రామీణ ప్రాంత పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చెరిపెల్లి యాదగిరి స్వామి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న మార్చురీ గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి స్వామి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతో పాటు తేలు, పాము కాట్లకు, క్రిమిసంహారక పురుగుల మందు తాగి, ఆత్మహత్యలు చేసుకునే వారి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటుచేసిన మార్చురీ గదిని ప్రారంభించి గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రమాదాలతో మృతి చెందే వారు జనగామ ఏరియా ఆసుపత్రిలో గల మార్చురీలకు వెళ్లాలంటే ఒక్కొక్కరికి సుమారు పదివేల వరకు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. పాలకుర్తి లో గల మార్చురీ ని ప్రారంభిస్తే పాలకుర్తి, కొరకండ్ల, దేవరుప్పుల మండలాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని తెలిపారు. మార్చురీ గది ఉపయోగములో లేకుంటే శిధిలావస్థకు చేరే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్పందించి మార్చురీని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని, సిబ్బందిని నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జలగం నరేష్, దండు రామచంద్రు, బొంకూరు యాకయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

The post మార్చురీ గదిని వాడుకలోకి తీసుకురావాలి: ఎమ్మార్పీఎస్ appeared first on Navatelangana.

​నవతెలంగాణ-పాలకుర్తిప్రభుత్వాసుపత్రిలో నిర్మించిన మార్చురీ గదిని వాడుకలోకి తీసుకువచ్చి గ్రామీణ ప్రాంత పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చెరిపెల్లి యాదగిరి స్వామి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న మార్చురీ గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి స్వామి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతో పాటు తేలు, పాము కాట్లకు, క్రిమిసంహారక పురుగుల మందు తాగి, ఆత్మహత్యలు చేసుకునే వారి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు
The post మార్చురీ గదిని వాడుకలోకి తీసుకురావాలి: ఎమ్మార్పీఎస్ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *