Headlines

సాహితీ వార్తలు

‘నువ్వు గింజవైతే’ ఆవిష్కరణ
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతి నెలా ఒకటి, మూడవ శనివారాల్లో నిర్వహిస్తోన్న ‘సాహిత్యవారం’ కార్యక్రమంలో భాగంగా హనీఫ్‌ కవితా సంపుటి ‘నువ్వు గింజవైతే’ ఆవిష్కరణ సభ ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాలలో జరుగుతుంది. డా.ఎన్‌.బాలాచారి, ప్రొ.జయధీర్‌ తిరుమల్‌ రావు, డా. సంగిశెట్టి శ్రీనివాస్‌, డా. రూపుమార్‌ డబ్బీకార్‌, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొంటారు. సాహితీమిత్రులు, భాషాభిమానులందరూ ఆహ్వానితులే.
డా. నామోజు బాలాచారి, కార్యదర్శి

రాజాం వేదికపై గోరటి మాట, పాట
ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రాజాం రచయితల వేదిక 11 వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇందులో పిల్లా తిరుపతిరావు రచించిన ‘పచ్చడం’ సాహిత్య వ్యాససంపుటి ఆవిష్కరణ వుంటుంది. గోరటి వెంకన్న గోరటి మాట, పాట ఉంటుంది. గార రంగనాథం, గంటేడ గౌరునాయుడు, బి.వి.అచ్యుత కుమార్‌, పిల్లా తిరుపతిరావు పాల్గొంటారు.
రాజాం రచయితల వేదిక

సాహితీ పోటీ ఫలితాలు
సామాజిక వేత్త బాదం మాధవరావు జ్ఞాపకార్థం గత నెలలో వివిధ సాహితీ ప్రక్రియల పోటీ నిర్వహించాం. అనువాద రచనల పోటీలో ఉత్తమ రచనగా మెహెర్‌ అనువదించిన మెటమార్ఫరస్‌ కధలు, కవితా ప్రక్రియల పోటీలో ఉత్తమ రచనగా ఏనుగు నరసింహారెడ్డి రచించిన ‘ఏడు కోలల బాయి’ కావ్యం ఎంపికైంది. బహుమతి ప్రదానం ఈ నెల 25న పిఠాపురంలో జరుగుతుంది.
ర్యాలి ప్రసాద్‌

The post సాహితీ వార్తలు appeared first on Navatelangana.

​‘నువ్వు గింజవైతే’ ఆవిష్కరణతెలంగాణ సాహిత్య అకాడమి ప్రతి నెలా ఒకటి, మూడవ శనివారాల్లో నిర్వహిస్తోన్న ‘సాహిత్యవారం’ కార్యక్రమంలో భాగంగా హనీఫ్‌ కవితా సంపుటి ‘నువ్వు గింజవైతే’ ఆవిష్కరణ సభ ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాలలో జరుగుతుంది. డా.ఎన్‌.బాలాచారి, ప్రొ.జయధీర్‌ తిరుమల్‌ రావు, డా. సంగిశెట్టి శ్రీనివాస్‌, డా. రూపుమార్‌ డబ్బీకార్‌, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొంటారు. సాహితీమిత్రులు, భాషాభిమానులందరూ ఆహ్వానితులే. డా. నామోజు బాలాచారి, కార్యదర్శి రాజాం వేదికపై గోరటి
The post సాహితీ వార్తలు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *