వీధి కుక్కల స్వైర విహారం
విశాలాంధ్ర – కడియం : కడియం మండలంలోని పలు గ్రామాలలో వీధి కుక్కల స్వైర విహారంతో పెద్దల నుండి పిల్లల వరకు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. బయటకు వెళ్ళాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కుక్కలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులను పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 1, 2025 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు దాదాపుగా 700 మంది కుక్కకాటుకు గురై కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు…
