Headlines

Eesha: హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమా చూడొద్దు !

Eesha Horror Thriller Movie Release Date Bunny Vas Vamsi Nandipati Akhil Raj Hebba Patel

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read :Samyuktha Menon: సంయుక్త మీనన్‌ రెమ్యునరేషన్‌ కోసం కక్కుర్తి పడిందా?

శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌, గ్లింప్స్‌ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా బన్నీవాస్‌ మాట్లాడుతూ ” మా మీద నమ్మకంతో దామోదర ప్రసాద్‌ గారు ఈ సినిమాను మా చేతిలో పెట్టారు. ఆయన పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగానే ఈసినిమాను జనాల్లోకి తీసుకవెళ్లడానికి కృషిచేస్తాం. విడుదల తేదికి సమయం తక్కువగా ఉన్న మా ఎఫర్ట్‌ అంతా పెడుతున్నాం. నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత నేను కూడా థియేటర్‌లో నాలుగు సార్లు భయపడ్డాను. దర్శకుడు నా లాంటి వాళ్లను భయపెట్టాడంటే కంటెంట్‌లో దమ్ము ఉందనపించింది. తెలిసి కూడా అందరిని భయపెట్టే సినిమా. అంటే భయపడతారని తెలిసిన భయపడతాం. చివరి పదిహేను నిమిషాలు సినిమా అందరికి ఎంతో థ్రిల్ల్‌ను కలిగిస్తుంది. చివరి పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తకుంటుంది. ఈ మధ్య కాలంలో అరవైకి పైగా సినిమాలు చూశాం. అందులో మూడు సినిమాలు సెలక్ట్‌ చేసుకున్నాను. అందులో ఇది కూడా ఒకటి. ఎవరి డబ్బులు వృథా చేయని సినిమా ఇది. టిక్కెట్‌ ధర కూడా రీజనల్‌బుల్‌గానే ఉంటుంది. ఇక ఈ సినిమాను హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు’ అన్నారు.

​ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *