
ఏపిలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి
– సారధి సినిమాస్ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : ఆంధ్ర ప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం రాజమండ్రిలో ప్రసాదిత్య మాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సారధి సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో పర్యాటకం, సంస్కృతి, వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఎపీలో సినిమా రంగ అభివృద్ధికి తొలి మెట్టుగా ప్రసాదిత్య మాల్ ను భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో చలన చిత్ర అభివృద్ధికి అవసరమైన స్టూడియోలు, రీరికార్డింగ్ ధియేటర్లు, డబ్బింగ్ ధియేటర్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న తరుణంలో సారధి సినిమాస్ తో ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. అంతకు ముందు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రిబ్బన్ కట్ చేసి సారధి సినిమాస్ ప్రారంభించారు. అనంతరం మాల్ యాజమాన్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమంపలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జీ అత్తి సత్యనారాయణ, జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరు స్క్రీన్లతో ఆధునిక మల్టీప్లెక్స్ ; చైర్మన్ ఎంఎస్ ఆర్ వి ప్రసాద్ రాజమహేంద్రవరం నగరంలోని ప్రసాదిత్య మాల్లో ఆరు స్క్రీన్లతో కూడిన ఆధునిక మల్టిప్లెక్స్‌ను ప్రారంభిస్తున్నట్లు సారథి సినిమాస్ చైర్మన్ ఎంఎస్ ఆర్ వి ప్రసాద్ చెప్పారు. గురువారం మధ్యాహ్నం స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులో నిర్మించిన ప్రసాదిత్య మాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సినిమాలను ప్రేమించే ప్రేక్షకులకు అత్యుత్తమమైన అనుభవాలను అందించాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థ 1956లో భారత దేశపు తొలి ఫిల్మ్ స్టూడియో శ్రీ సారథి స్టూడియోస్ ను హైద్రాబాద్ లో నిర్మించిందని, అలాగే ప్రస్తుతం రాజమండ్రి నగరంలో మొదటి సారిగా మాల్ , మల్టిప్లెక్స్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కె. వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రసాదిత్య గ్రూప్‌లో భాగమైన శ్రీ సారథి స్టూడియోస్, స్టూడియో ఫ్లోర్లు, ఎడిటింగ్, డబ్బింగ్, విఎఫ్ ఎక్స్, ఎస్ ఎఫ్ ఎక్స్, డిఐలతో పాటు డాల్బీ మిక్సింగ్ వంటి అత్యాధునిక పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలు ఇందులో ఉంటాయన్నారు. గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన రాజమండ్రి వినోద ప్రపంచానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలు అందించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మాల్ లో సౌకర్యవంతమైన, ఆత్మీయ వీక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆడిటోరియంలు. ఆరు ప్రీమియం స్క్రీన్లతో పాటు అత్యద్భుతమైన స్పష్టత, , రంగుల ఖచ్చితత్వంతో విజువల్స్ అందించడానికి బార్కో ఆర్జిబి సిరీస్ 4కె లేజర్ ప్రాజెక్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 స్క్రీన్లలో డాల్బీ అట్మాస ఆడియో. స్పష్టతతో నిండిన ఆడియో అనుభవం కోసం 3 స్క్రీన్లలో 7.1 సరౌండ్ సౌండ్. క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ క్వాలిటీ కోసం హై-గైన్ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు క్యూబ్ సినిమాని భాగస్వామిగా చేసుకున్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. అలాగే, ఈ మాల్ లోని ప్రతి వస్తువు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టామని, ముఖ్యంగా సామాన్య దిగువ మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ మాల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. నేడు సినిమాలను చూడడానికి ప్రేక్షకులు సినిమా ధియేటర్లకు రాకపోవడం వల్ల అవి మూతపడుతున్నాయని, ఇలాంటి పరిస్థితులలో ఆరు ప్రీమియం స్క్రీన్లు ఏర్పాటుచేయడంలో ఆంతర్యమేమిటని అడుగగా, మంచి సినిమాకు ప్రజలు ఇంకా బ్రహ్మరధం పడుతూనే ఉన్నారని, అందువల్ల ప్రేక్షకులు సారధి సినిమాస్ ను ఆదరిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్ కె. వెంకటేశ్వరరావు, సంస్థ ప్రతినిధి స్మిత రోహిత్ పాల్గొన్నారు.
The post రాజమండ్రిలో ప్రసాదిత్య మాల్ appeared first on Visalaandhra.
ఏపిలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి– సారధి సినిమాస్ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : ఆంధ్ర ప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం రాజమండ్రిలో ప్రసాదిత్య మాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సారధి సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో పర్యాటకం, సంస్కృతి, వినోద రంగాల్లో మరింత అభివృద్ధి
The post రాజమండ్రిలో ప్రసాదిత్య మాల్ appeared first on Visalaandhra.
