Headlines

సమాన పనికి సమాన వేతనం

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

– సిఆర్పిలు డిమాండ్

విశాలాంధ్ర – రాజానగరం : సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని క్లస్టర్ రిపోర్స్ పర్సన్ (సిఆర్పిలు) ఎస్ వి వి రామకృష్ణ ,ఆర్.పూసలరావు అన్నారు. మండల కేంద్రమైన రాజానగరంలోని ఎంఈవో కార్యాలయంలో గత కొన్నేళ్లుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గా కీలక సేవలందిస్తున్న సిఆర్పిలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగా తహశీల్దార్ జి.అనంత లక్ష్మీ సత్యవతి దేవికి , మండల విద్యాశాఖ అధికారులు ఎం.రామన్న దొర, గుబ్బల జ్యోతి ప్రసాద్ లకు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశాలాంధ్రతో మాట్లాడుతూ పాఠశాల అసిస్టెంట్స్ తో సమానంగా సేవలు అందిస్తున్నామని, తమకు సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతో పాటు,ఉద్యోగ భద్రత పిఎఫ్, గ్రాడ్యుటి హెల్త్ కార్డులు తదితర అంశాలపై ప్రభుత్వ పరంగా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.తమ సమస్యలపై అధికారులు స్పందించాలని లేకుంటే తమ పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఆర్పిలు బి.కొండలరావు,బి.రాణి,కె.వీర పండు,ఎం ఐ ఎస్ బి హైమావతి,ఎంఆర్సి అసిస్టెంట్ ఎం వీరబాబు తదితరులు పాల్గొన్నారు

The post సమాన పనికి సమాన వేతనం appeared first on Visalaandhra.

​సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి – సిఆర్పిలు డిమాండ్ విశాలాంధ్ర – రాజానగరం : సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని క్లస్టర్ రిపోర్స్ పర్సన్ (సిఆర్పిలు) ఎస్ వి వి రామకృష్ణ ,ఆర్.పూసలరావు అన్నారు. మండల కేంద్రమైన రాజానగరంలోని ఎంఈవో కార్యాలయంలో గత కొన్నేళ్లుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గా కీలక సేవలందిస్తున్న సిఆర్పిలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగా తహశీల్దార్ జి.అనంత లక్ష్మీ సత్యవతి దేవికి , మండల విద్యాశాఖ అధికారులు ఎం.రామన్న
The post సమాన పనికి సమాన వేతనం appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *