Headlines

Gold Price Today : గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి బంగారం, వెండి ధరలు ఇవే.. చెన్నైలో మాత్రం రికార్డుల మోత..

Gold Price Today

Gold Price Today : బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమయ్యారా.. అయితే, మీకు గుడ్‌న్యూస్.. కొద్దిరోజులుగా వీటి ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. దేశంలో బంగారం ధర  (Gold Price Today) భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. మరోవైపు వెండి రేటు కూడా తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బంగారం, వెండి ధరలు రాబోయే వారం రోజుల్లో భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 540 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 500 తగ్గింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 15డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 4,197డాలర్ల వద్ద కొనసాగుతుంది.
వెండి ధరల్లో గత మూడు రోజులుగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శనివారం కిలో వెండిపై రూ. 100 తగ్గింది. అయితే, గురు, శుక్రవారాల్లో కిలో వెండిపై రూ. 5వేలు తగ్గింది. దీంతో మూడు రోజుల్లో కిలో వెండిపై రూ.5,100 తగ్గుదల చోటు చేసుకుంది.
ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాల్లో వెండి రేటు పెరిగింది. కిలో వెండిపై రూ.3వేలు పెరిగింది. చెన్నైలో ప్రస్తుతం కిలో వెండి రూ.1,99,000 రికార్డు ధరకు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,19,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,30,150కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,450 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,30,300కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,19,300 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,30,150కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,95,900 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో వెండి రేటు పెరిగింది. కిలో వెండిపై రూ.3వేలు పెరిగింది. దీంతో ఇక్కడ కిలో వెండి రేటు రూ.1,90,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలోనూ కిలో వెండిపై రూ. 3వేలు పెరిగింది. దీంతో ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,99,000 వద్దకు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

​Gold Price Today : బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమయ్యారా.. అయితే, మీకు గుడ్‌న్యూస్.. కొద్దిరోజులుగా వీటి ధరల్లో భారీగా మార్పులు ..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *