Headlines

గ్యాస్‌ సిలిండర్ల ట్రక్కులు ఢీ..పేలుడుతో దద్దరిల్లిన జాతీయ రహదారి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాజస్థాన్‌లో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కు, మరో ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో మంటలు వ్యాపించి గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటన జైపుర్‌-అజ్మేర్‌ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనతో సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.

పేలుడు ఘటనతో రహదారిపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఈ ఘటనపై రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ ఆదేశాలతో డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్‌ బైర్వా ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెండు ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. వారి జాడ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే భారీ పేలుళ్ల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా సమీపంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిని అధికారులు సిద్ధం చేశారు.

The post గ్యాస్‌ సిలిండర్ల ట్రక్కులు ఢీ..పేలుడుతో దద్దరిల్లిన జాతీయ రహదారి appeared first on Navatelangana.

​న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాజస్థాన్‌లో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కు, మరో ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో మంటలు వ్యాపించి గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటన జైపుర్‌-అజ్మేర్‌ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనతో సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పేలుడు ఘటనతో రహదారిపై భారీ
The post గ్యాస్‌ సిలిండర్ల ట్రక్కులు ఢీ..పేలుడుతో దద్దరిల్లిన జాతీయ రహదారి appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *