క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు ఆరోగ్యమును ఇవ్వడమే మా లక్ష్యం అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బివి రమణ, క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 115వ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్ణాతులైన వైద్యులచే రోగులకు ప్రత్యేక వైద్య చికిత్సలను అందించడం జరిగిందని, అదేవిధంగా ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 300 మంది రోగులకు వైద్య శిథిషలతో పాటు ఒక నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరానికి దాతగా శీలం ప్రకాష్ వ్యవహరించడం పట్ల, వారిని ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సిరివెళ్ల రాధాకృష్ణ, మామిళ్ళ అశ్వత్ నారాయణ తోపాటు బండి నాగరాజు, బంధనాదం చిన్నికృష్ణ ,డాక్టర్ వినయ్, కాచర్ల నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
The post పేద ప్రజలకు ఆరోగ్యమును ఇవ్వడమే మా లక్ష్యం.. appeared first on Visalaandhra.
క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు ఆరోగ్యమును ఇవ్వడమే మా లక్ష్యం అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బివి రమణ, క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 115వ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్ణాతులైన వైద్యులచే రోగులకు ప్రత్యేక
The post పేద ప్రజలకు ఆరోగ్యమును ఇవ్వడమే మా లక్ష్యం.. appeared first on Visalaandhra.
