Headlines

స్వచ్ఛంద  సంస్థల సేవలు అవసరం ఎమ్మెల్యే నల్లమిల్లి

విపత్కర స్థితులలో  స్వచ్ఛంద  సంస్థల సేవలు అవసరం.

 విశాలాంధ్ర –  అనపర్తి : ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు స్వచ్ఛంద  సేవా సంస్థలు ముందుకొచ్చి సేవలందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో  శ్రీ కాశి అన్నపూర్ణ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మొంథా తుఫాన్ ప్రభావంతో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో సుమారు వందమందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు సేవలు అభినందనీయమని అన్నారు. మహేంద్రవాడ గ్రామ మాజీ ఎంపీటీసీ వెలగల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పై భారం తగ్గించే ప్రయత్నంలో  స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చి ఆపన హస్తం అందించడం అభినందనీయమన్నారు. రావులపాలెం చెందిన శ్రీ కాశి అన్నపూర్ణ సేవా సంస్థ వారు మా గ్రామంలో భోజనాలు పంపిణీ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అనిల్, ఎంపీడీవో రామకృష్ణారెడ్డి,  సొసైటీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, జనసేన నాయకులు రావాడ నాగు, సత్తి సుబ్బారెడ్డి, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు కూటమి నాయకులు పాల్గొన్నారు.

The post స్వచ్ఛంద  సంస్థల సేవలు అవసరం ఎమ్మెల్యే నల్లమిల్లి appeared first on Visalaandhra.

​విపత్కర స్థితులలో  స్వచ్ఛంద  సంస్థల సేవలు అవసరం.  విశాలాంధ్ర –  అనపర్తి : ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు స్వచ్ఛంద  సేవా సంస్థలు ముందుకొచ్చి సేవలందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో  శ్రీ కాశి అన్నపూర్ణ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మొంథా తుఫాన్ ప్రభావంతో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో సుమారు వందమందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా భోజనాలు పంపిణీ చేశారు.
The post స్వచ్ఛంద  సంస్థల సేవలు అవసరం ఎమ్మెల్యే నల్లమిల్లి appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *