Headlines

అజారుద్దీన్‌కు కేబినెట్‌లో చోటు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణ యం తీసుకుంది. ఇంతవరకు మంత్రివర్గంలో మైనార్టీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ స్థానంలో క్రికెట్ మాజీ కెప్టె న్ అజారుద్దీన్‌కు చోటు కల్పించాలని సీఎం నిర్ణయం తీ సుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రివర్గ విస్తరణలో ఆజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజ్‌భవన్‌కు సమాచారం పంపించినట్టుఅధికార వర్గాల సమాచారం. కాగా…

Read More

Cyclone Montha: హనుమకొండలో వరద బీభత్సం.. ఇళ్లలోకి చేరిన నీరు.. సాయం కోసం బాధితుల వేడుకోలు..

Cyclone Montha: వరంగల్ నగరంలోని హనుమకొండలో వరద బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో స్థానికులకు ప్రాణభయం పట్టుకుంది. సాయం కోసం ఆర్తనాదాలు పెట్టారు. వెంటనే పోలీసులు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. జేసీబీలు, తాళ్ల సాయంతో బాధితులను రక్షించేందుకు రెస్క్యూ చేశారు. రామకృష్ణ, రెవెన్యూ కాలనీలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు భారీ వర్షాల నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు….

Read More

పంట పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి

పంటల నష్టం వివరాలను తెలియజేయండి. మండలంలోని చిట్యాల గ్రామంలో ఒరిగిపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. విశాలాంధ్ర – గోపాలపురం : తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన మరియు గృహాలు పూర్తి గాను పాక్షికంగాను దెబ్బతిన్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. బుధవారం మండలంలోని చిట్యాల, వెంకటాయపాలెం గ్రామాలలో ఈదురు గాలులకు ఒరిగిపోయిన వరి పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అగ్రికల్చరల్ ఏవో తో మాట్లాడుతూ మండలంలోని…

Read More

జూబ్లీహిల్స్ లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చని, మూడేళ్ల వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఉం డదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పైసలు ఇస్తే తీసుకోవాలని, కానీ, ఓటు మాత్రం బిఆర్‌ఎస్‌కు వేయాలని ఆయన కోరారు. కత్తి వాళ్లకు ఇ చ్చి యుద్ధం తమను చేయమంటే ఎలా అని కెటిఆర్ ప్రశ్నించారు. కత్తి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ తో యుద్ధం చేసే బాధ్యత తమదని…

Read More

బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ దొందూదొందే

వరంగల్‌కు ‘సామాజిక చైతన్య రథయాత్ర’ బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారం చేజిక్కించుకోవాలి :ఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ నవతెలంగాణ – హైదరాబాద్‌పాలన విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు దొందూ దొందే అని, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారం చేజిక్కించుకోవాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌ దళ్‌ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ అన్నారు. ఆయన తలపెట్టిన ‘సామాజిక చైతన్య రథయాత్ర’ బుధవారం వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో…

Read More

స్వచ్ఛంద  సంస్థల సేవలు అవసరం ఎమ్మెల్యే నల్లమిల్లి

విపత్కర స్థితులలో  స్వచ్ఛంద  సంస్థల సేవలు అవసరం.  విశాలాంధ్ర –  అనపర్తి : ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు స్వచ్ఛంద  సేవా సంస్థలు ముందుకొచ్చి సేవలందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో  శ్రీ కాశి అన్నపూర్ణ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మొంథా తుఫాన్ ప్రభావంతో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో సుమారు వందమందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా భోజనాలు పంపిణీ చేశారు….

Read More

ఆలయాభివృద్ధి పనులు పూర్తి చేయాలి

సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కేఎస్‌ శ్రీనివాస రాజుమేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయ పనుల పరిశీలన నవతెలంగాణ – ములుగువచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కేఎస్‌ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ…

Read More

పీవీ సంస్కరణల వల్లే తెలంగాణలో పెట్టుబడులు

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు ముందు చూపుతో అమలు చేసిన ఎల్పీజీ సంస్కరణల వల్లే తెలంగాణకు విరివిగా పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం ‘మెక్‌ డొనాల్డ్స్‌’ 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఏర్పాటు చేసిన ‘గ్లోబల్‌ ఆఫీస్‌’ను బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. అనంతరం…

Read More

ప్రగళ్లపాటి కనకరాజుకు జీవిత సాఫల్య పురస్కారం 

ప్రగళ్లపాటి కనకరాజుకు విద్యావిభాగంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జీవిత సాఫల్య పురస్కారం  విశాలాంధ్ర – గోకవరం : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో నిర్వహించబడిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఫంక్షన్లో ప్రముఖ విద్య, సేవా మూర్తి ప్రగళ్లపాటి కనకరాజు విద్యావిభాగంలో జీవిత సాఫల్య పురస్కారం అవార్డులో అందుకున్నారు. ఈ ఘన సమారోహం సమాజ సేవ, విద్యా సేవ స్ఫూర్తిగా, వాసవి ధర్మా తత్వాల సమ్మేళంగా నిలిచింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమావేశం మంగళ వారం…

Read More

మహిళా హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చట్టం చేయాలి

ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మహిళా హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చట్టం చేయాలని ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి డిమాండ్‌ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు 2026 జనవరి 25- 28 తేదీల్లో హైదరాబాదులో జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతన్నాయనీ, ముఖ్యంగా బీజేపీ…

Read More