తాళ్లపూడి మండలం లో పంట నష్టం మూడు వేల ఎకరాల పై మాటే*
విశాలాంధ్ర – తాళ్లపూడి : తుఫాను ప్రభావం ఎక్కువ శాతం వ్యవసాయ పంటల పై చూపింది. దాదాపుగా 3000 ఎకరాల కు పైగా భారీ వర్షాల గాలుల తాకిడి కి గురయ్యాయని అధికారుల ప్రాధమిక అంచనా. వరి, ఆరటి, మినుము పంటల రైతులు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఉన్నతధికారుల ఆదేశాల మేరకు నష్టాల అంచనా చేయిస్తున్నారు. సచివాలయాల వ్యవసాయ సహాయకులు ద్వారా పంటలను పరిశీలించి జాబితాలు తయారు చేయాలని ఆదేశించినట్లు వ్యవసాయాధికారిని రుచిత తెలిపారు. 2000 ఎకరాల వరి, 600 ఎకరాల మినుము పాడైనట్లు తెలిపారు. కాగా వరి పండించిన రైతాంగం చేతికొచ్చిన పంట నీటి పాలైందని, తడిచిన ధాన్యం కొనే పరిస్థితి ఉండదని వేగేశ్వరపురం, పెద్దెవం, గజ్జరం తదితర రైతులు ఆందోళన చెందుతున్నారు.
*ఉద్యానవన పంటల రైతులు సూచనలు పాటించండి* తుపాను ప్రభావం తో కురిసిన అధిక వర్షాలు మరియు గాలులు కు తాళ్లపూడి మండలం లోని పలు ప్రాంతాల్లో అరటి ఉద్యానవన పంటలు కూడా పాడయ్యాయి. మొంథా తుపాను నేపథ్యం లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొవ్వూరు మండలం ఉద్యాన అధికారి- డి.సుధీర్ కుమార్ తెలిపారు. అరటి ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు బృందం, డాక్టర్ పి లలిత కామేశ్వరి, డాక్టర్ కే.రవీంద్ర కుమార్ బృందం కొవ్వూరు మండలం పెనకనమెట్ట, తాళ్లపూడి మండలం మలకపల్లి లో పర్యవేక్షించి రైతులకు మెళకువలు తెలిపారు .
The post పంట నష్టం మూడు వేల ఎకరాల పై మాటే appeared first on Visalaandhra.
తాళ్లపూడి మండలం లో పంట నష్టం మూడు వేల ఎకరాల పై మాటే* విశాలాంధ్ర – తాళ్లపూడి : తుఫాను ప్రభావం ఎక్కువ శాతం వ్యవసాయ పంటల పై చూపింది. దాదాపుగా 3000 ఎకరాల కు పైగా భారీ వర్షాల గాలుల తాకిడి కి గురయ్యాయని అధికారుల ప్రాధమిక అంచనా. వరి, ఆరటి, మినుము పంటల రైతులు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఉన్నతధికారుల ఆదేశాల మేరకు నష్టాల అంచనా చేయిస్తున్నారు. సచివాలయాల వ్యవసాయ సహాయకులు ద్వారా
The post పంట నష్టం మూడు వేల ఎకరాల పై మాటే appeared first on Visalaandhra.
