Headlines

ఆరోగ్యం పట్ల ప్రజలు ప్రత్యేకశ్రద్ధ వహించాలి

విశాలాంధ్ర – కడియం : మొంథా తుఫాను కారణంగా ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కడియం, కడియపులంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ ఎం మణిజ్యోత్స్న, డాక్టర్ ఎన్ జెస్సీ సుప్రియ అన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా ఉంటుందని, దీనివల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, కావున ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని, తద్వారా డయేరియా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. తుఫాను అనంతర చర్యలలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటి జ్వరాల సర్వే చేస్తున్నారని చెప్పారు. పంచాయతీ వారి సహకారంతో నిల్వ ఉన్న నీటిలో దోమల మందు పిచికారీ చేస్తున్నారని, వాటర్ క్వాలిటీ టెస్ట్ నిర్వహిస్తున్నారని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఎవరికైనా స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించినా, వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగు వైద్యం తీసుకోవాలని తెలిపారు.

The post ఆరోగ్యం పట్ల ప్రజలు ప్రత్యేకశ్రద్ధ వహించాలి appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – కడియం : మొంథా తుఫాను కారణంగా ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కడియం, కడియపులంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ ఎం మణిజ్యోత్స్న, డాక్టర్ ఎన్ జెస్సీ సుప్రియ అన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా ఉంటుందని, దీనివల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, కావున ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, వేడిగా ఉన్న ఆహార పదార్థాలు
The post ఆరోగ్యం పట్ల ప్రజలు ప్రత్యేకశ్రద్ధ వహించాలి appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *