
ఫర్నిచర్‌కు నిప్పు.. ఫ్లెక్సీల చించివేత
బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
పలువురికి గాయాలు
పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు
దాడి సిగ్గుమాలిన చర్య: మాజీ ఎంఎల్ఎ రేగా ధ్వజం
కాంగ్రెస్ ఆస్తి తిరిగి స్వాధీనం చేసుకున్నాం: ఎంఎల్ఎ
పొదెం వీరయ్య, పాయం వెంకటేశ్వర్లు
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/మణుగూర్: మణుగూర్ పట్టణంలో వివాదాస్పదంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ (తెలంగాణ భవనం)ను కాంగ్రెస్ కార్యకర్త లు హస్తగతం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొదటి ఈ కార్యాల యం కాంగ్రెస్ కార్యాలయం కాగా కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్లో చేరిన రేగా కాంతారావు కాంగ్రెస్ కార్యాలయా న్ని బిఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకున్నారు. రేగా పార్టీ మారిన నాటి నుంచి ఈ పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికి వీలు పడలేదు. అయితే ఈ సం దర్భంగా జరిగిన కొన్ని సంఘటనలు ఉద్రిక్తతకు దా రి తీసి 144 సెక్షన్‌ను విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పినపాక నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో కాం గ్రెస్ నుంచి గెలుపొందిన రేగా కాంతారావు ఆ తరువాత అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ పిఇటి టీచర్ అయిన రేగా కాంతారావు తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచా రు. ఈ సందర్భంగా మణుగూర్ పట్టణంలో కాంగ్రెస్ అ భిమానులు, దాతలు, నాయకుల విరాళాలతో అక్కడ ఇం దిరమ్మ భవనం పేరుతో కాంగ్రెస్ కార్యాలయాన్ని నిర్మిం చి నడిపిస్తున్నారు.అయితే రేగా కాంతారావు పార్టీ మారి బిఆర్ఎస్లో చేరిన సమయంలో ఈ కార్యాలయాన్ని కాం గ్రెస్ పార్టీకి వదిలివేయకుండా మూడు రంగులను చెరిపేసి గులాబీ రంగు వేసి తెలంగాణ భవన్‌గా నామకర ణం చేశారు.అప్పట్లోనే స్ద్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రేగా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలుమార్లు ఆ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముఖ్యనేతలు విఫలయత్నం చేశారు.
2023 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించగా, బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేగా కాంతారావు ఓటమి పాలయ్యారు. ఆదివారం వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అద ను చూసి ర్యాలీగా వెళ్ళీ తెలంగాణ భవన్‌ను ముట్టడించి కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్ళి తమ ఆధీనంలోకి తీ సుకున్నారు. కార్యాలయంలోని ఫ్లెక్సీలను, గులాబీ రం గుల్లో ఉన్న కుర్చీలను, ఫర్నీచర్‌ను బయట వేసి దగ్ధం చే శారు. ఇందిరమ్మ భవన్‌గా నామకరణం చేస్తూ ఫెక్లీని ఏర్పాటు చేశారు. ఈ సంఘటనలో ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు.ఫర్నీచర్‌ను దగ్ధం చేయడంతో కార్యాలయ ముందు పెద్ద మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఆగ్నిమాపక సిబ్బంది వచ్చి మం టలను అర్పి. డిఎస్పి వంగారవీందర్రెడ్డి నేతృత్వంలో పోలీసులు బలగాలు అక్కడి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ రంగులో ఉన్న కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ జెండాకు ఉన్న మూడు రంగులను వేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నాం: పొదెం, పాయం
మణుగూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్యకర్తల ఆస్తిని కబ్జాదారుల నుండి తిరిగి కాంగ్రెస్ ఆధీనంలోకి రావడం పార్టీకి ఒక శుభపరిణామం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య, స్ద్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో ఆదివారం చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీగా బయలుదేరి, గతంలో బిఆర్ఎస్ పార్టీ భవనంగా మార్చిన ఇందిరా భవన్‌ను తిరిగి కాంగ్రెస్ పార్టీ తమ ఆధీనంలోకి తీసుకుందన్నారు.
దాడి సిగ్గుమాలిన చర్య: రేగా కాంతారావు
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ రౌడీలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్యని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు మండిపడ్డారు. ఆదివారం మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బి ఆర్ ఎస్ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని, దాడిని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు.
ఫర్నిచర్‌కు నిప్పు.. ఫ్లెక్సీల చించివేతబిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ పలువురికి గాయాలు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు
దాడి సిగ్గుమాలిన చర్య: మాజీ ఎంఎల్ఎ రేగా ధ్వజం కాంగ్రెస్ ఆస్తి తిరిగి స్వాధీనం చేసుకున్నాం: ఎంఎల్ఎపొదెం వీరయ్య, పాయం వెంకటేశ్వర్లుమన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/మణుగూర్: మణుగూర్ పట్టణంలో వివాదాస్పదంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ (తెలంగాణ భవనం)ను కాంగ్రెస్ కార్యకర్త లు హస్తగతం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొదటి ఈ కార్యాల యం కాంగ్రెస్ కార్యాలయం కాగా కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్లో చేరిన రేగా కాంతారావు కాంగ్రెస్ కార్యాలయా న్ని బిఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకున్నారు. రేగా పార్టీ మారిన నాటి నుంచి ఈ పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికి వీలు పడలేదు. అయితే ఈ సం దర్భంగా జరిగిన కొన్ని సంఘటనలు ఉద్రిక్తతకు దా రి తీసి 144 సెక్షన్‌ను విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పినపాక నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో కాం గ్రెస్ నుంచి గెలుపొందిన రేగా కాంతారావు ఆ తరువాత అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ పిఇటి టీచర్ అయిన రేగా కాంతారావు తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచా రు. ఈ సందర్భంగా మణుగూర్ పట్టణంలో కాంగ్రెస్ అ భిమానులు, దాతలు, నాయకుల విరాళాలతో అక్కడ ఇం దిరమ్మ భవనం పేరుతో కాంగ్రెస్ కార్యాలయాన్ని నిర్మిం చి నడిపిస్తున్నారు.అయితే రేగా కాంతారావు పార్టీ మారి బిఆర్ఎస్లో చేరిన సమయంలో ఈ కార్యాలయాన్ని కాం గ్రెస్ పార్టీకి వదిలివేయకుండా మూడు రంగులను చెరిపేసి గులాబీ రంగు వేసి తెలంగాణ భవన్‌గా నామకర ణం చేశారు.అప్పట్లోనే స్ద్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రేగా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలుమార్లు ఆ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముఖ్యనేతలు విఫలయత్నం చేశారు. 2023 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించగా, బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేగా కాంతారావు ఓటమి పాలయ్యారు. ఆదివారం వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అద ను చూసి ర్యాలీగా వెళ్ళీ తెలంగాణ భవన్‌ను ముట్టడించి కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్ళి తమ ఆధీనంలోకి తీ సుకున్నారు. కార్యాలయంలోని ఫ్లెక్సీలను, గులాబీ రం గుల్లో ఉన్న కుర్చీలను, ఫర్నీచర్‌ను బయట వేసి దగ్ధం చే శారు. ఇందిరమ్మ భవన్‌గా నామకరణం చేస్తూ ఫెక్లీని ఏర్పాటు చేశారు. ఈ సంఘటనలో ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు.ఫర్నీచర్‌ను దగ్ధం చేయడంతో కార్యాలయ ముందు పెద్ద మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఆగ్నిమాపక సిబ్బంది వచ్చి మం టలను అర్పి. డిఎస్పి వంగారవీందర్రెడ్డి నేతృత్వంలో పోలీసులు బలగాలు అక్కడి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ రంగులో ఉన్న కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ జెండాకు ఉన్న మూడు రంగులను వేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నాం: పొదెం, పాయం
మణుగూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్యకర్తల ఆస్తిని కబ్జాదారుల నుండి తిరిగి కాంగ్రెస్ ఆధీనంలోకి రావడం పార్టీకి ఒక శుభపరిణామం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య, స్ద్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో ఆదివారం చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీగా బయలుదేరి, గతంలో బిఆర్ఎస్ పార్టీ భవనంగా మార్చిన ఇందిరా భవన్‌ను తిరిగి కాంగ్రెస్ పార్టీ తమ ఆధీనంలోకి తీసుకుందన్నారు.
దాడి సిగ్గుమాలిన చర్య: రేగా కాంతారావు
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ రౌడీలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్యని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు మండిపడ్డారు. ఆదివారం మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బి ఆర్ ఎస్ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని, దాడిని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు.
