హోబర్ట్: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో టి20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఆసీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 18.3 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగాఎదుర్కొన్న అభిషేక్ 16 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు.
మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లోనూ నిరాశ పరిచాడు. 12 బంతుల్లో ఒక ఫోర్‌తో 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లను నాథన్ ఎల్లిస్ పడగొట్టడం విశేషం. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (17) కూడా ఎక్కవు సేపు క్రీజులో నిలువడంలో విఫలమయ్యాడు. దీంతో భారత్ 111 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో వాషింగ్టన్ సుందర్‌తో కలిసి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ ఒక ఫోర్, మరో సిక్స్‌తో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. తిలక్ ఔటైనా వాషింగ్టన్ తన జోరును కొనసాగించాడు. అతనికి వికెట్ కీపర్ జితేశ్ శర్మ అండగా నిలిచాడు. ఇటు వాషింగ్టన్ అటు జితేశ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సుందర్ 23 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జితేశ్ శర్మ 13 బంతుల్లోనే 3 ఫోర్లతో అజేయంగా 22 పరుగులు సాధించాడు. దీంతో భారత్ అలవోక విజయాన్ని అందుకుంది.
ఆరంభం నుంచే..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (6) పరుగులు మాత్రమే చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ కూడా నిరాశ పరిచాడు. ఏడు బంతులు ఎదుర్కొన్న ఇంగ్లిస్ ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్‌కు కూడా అర్ష్‌దీప్‌కే దక్కింది. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ మిఛెల్ మార్ష్ కూడా ఘోరంగా విఫలమయ్యాడు. 11 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మిఛెల్ ఓవెన్ (0) ఖాతా తెరవకుండానే ఇంటిదారి పట్టాడు. ఈ వికెట్ కూడా వరుణ్‌కే దక్కింది. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్కస్ స్టోయినిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా అర్ష్‌దీప్‌కే దక్కడం విశేషం. ఇక ధాటిగా ఆడిన మాథ్యూ షార్ట్ 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వేగంగా 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరును సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ మూడు, వరుణ్ రెండు వికెట్లను పడగొట్టారు.
హోబర్ట్: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో టి20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఆసీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 18.3 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగాఎదుర్కొన్న అభిషేక్ 16 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లోనూ నిరాశ పరిచాడు. 12 బంతుల్లో ఒక ఫోర్‌తో 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లను నాథన్ ఎల్లిస్ పడగొట్టడం విశేషం. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (17) కూడా ఎక్కవు సేపు క్రీజులో నిలువడంలో విఫలమయ్యాడు. దీంతో భారత్ 111 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్‌తో కలిసి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ ఒక ఫోర్, మరో సిక్స్‌తో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. తిలక్ ఔటైనా వాషింగ్టన్ తన జోరును కొనసాగించాడు. అతనికి వికెట్ కీపర్ జితేశ్ శర్మ అండగా నిలిచాడు. ఇటు వాషింగ్టన్ అటు జితేశ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సుందర్ 23 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జితేశ్ శర్మ 13 బంతుల్లోనే 3 ఫోర్లతో అజేయంగా 22 పరుగులు సాధించాడు. దీంతో భారత్ అలవోక విజయాన్ని అందుకుంది.ఆరంభం నుంచే..