Headlines

రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం

రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం” కార్యక్రమమా?
–వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఎద్దేవా.

విశాలాంధ్ర – కడియం : రైతులను అన్నివిధాలా చావగొట్టి చెవులు మూసిన కూటమి ప్రభుత్వం ఇవాళ ఏమి ఎరగనట్టు “రైతన్నా మీకోసం” కార్యక్రమం పెట్టి రైతులకు ఏదో చేసినట్టు మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పేర్కొన్నారు. ఆయన మంగళవారం కడియం లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆది నుంచి రైతులకు వ్యతిరేకమే అన్నారు. గతంలోనే చంద్రబాబు వ్యవసాయం దండగ అని రైతులను హేళన చేశారని, దివంగత నేత ఎన్టీ రామారావు రైతులకు వెనుదన్నుగా ఉంటే, చంద్రబాబు ఉచిత విద్యుత్ గురించి అవహేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్తు అందించి, రైతులకు రుణమాఫీ చేశారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం, రైతుల పంటలకు ఇన్సూరెన్స్ కట్టడం రైతుల పంటలకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందేలా చూడడం, రైతు పంటల ధరలకు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయటం వంటి కార్యక్రమాలను చేపట్టి రైతు నేస్తం గా పేరు తెచ్చుకున్నారన్నారు. ఎస్సీ, బిసి కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించకుండా వారి భద్రతను నట్టేట్లో ముంచేసారని తీవ్రంగా దుయ్యపట్టారు. రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు వాటి సేవలను మరింత దూరం చేశారని గిరజాల ఆవేదన వ్యక్తం చేశారు. గత సీజన్లో రైతుల దగ్గర నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఎన్నో ఇబ్బందులు గురి చేశారని, అలాగే ధాన్యం తూచిన రైతులకు నెలల తరబడి సొమ్ములు చెల్లించలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల అన్ని రకాల పంటల రైతాంగం ఎన్నో నష్టాల్ని, కష్టాల్ని ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వైసిపి ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సేద్యం విస్తీర్ణం బాగా తగ్గిపోయిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం రైతాంగానికి పూర్తిస్థాయిలో యూరియా, ఎరువులు అందించలేకపోతుందన్నారు. కాల్దారిలో రైతులను కాల్పించిన సంఘటన చరిత్ర ఎన్నటికీ మరిచిపోదని ఈ సందర్భంగా ఆనాటి సంఘటనను గుర్తు చేశారు. ఇకనైనా చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ మాని వారిని ఆదుకునేందుకు కృషి చేయాలని
గిరజాల డిమాండ్ చేశారు.

The post రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం appeared first on Visalaandhra.

​రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం” కార్యక్రమమా?–వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఎద్దేవా. విశాలాంధ్ర – కడియం : రైతులను అన్నివిధాలా చావగొట్టి చెవులు మూసిన కూటమి ప్రభుత్వం ఇవాళ ఏమి ఎరగనట్టు “రైతన్నా మీకోసం” కార్యక్రమం పెట్టి రైతులకు ఏదో చేసినట్టు మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పేర్కొన్నారు. ఆయన మంగళవారం కడియం లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆది నుంచి రైతులకు వ్యతిరేకమే
The post రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *