మురమండ, దుళ్ల కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు.
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మురమండ, దుళ్ల గ్రామ పంచాయతీలలో గ్రేడ్ 2 గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్న రావిపాటి సత్యనారాయణ, బిక్కి సత్యానందకుమార్ లకు గ్రేడ్-1 కార్యదర్శులుగా పదోన్నతులు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. జోన్ 2 పరిధిలో ఉన్న వీరిలో సత్యనారాయణ ను అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నియమించగా సత్యానంద కుమార్ ను తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలలో అనేక మందికి పదోన్నతులు వస్తున్నాయి. అందులో భాగంగానే వీరికి గ్రేడ్ 2 నుంచి గ్రేడ్-1 కేటాయించారు. గ్రేట్-3 కార్యదర్శిగా సత్యనారాయణ ఆలమూరు మండలం చెముడులంక, నర్సిపూడి, ఆలమూరు, పినపళ్ల, బడుగువానిలంక తదితర గ్రామాల్లో పనిచేసి గ్రేడ్ 2 కార్యదర్శిగా పదోన్నతి పొంది కడియం మండలం మురమండ పంచాయతీకి గతేడాది వచ్చారు. ఇంతలోనే మరో పదోన్నతి పొంది కోనసీమ జిల్లాకు నియమించ బడ్డారు. అలాగే సత్యానంద కుమార్ అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామ పంచాయతీ నుంచి కొద్దినెలల క్రితమే దుళ్ల బదిలీపై వచ్చి పదోన్నతిపై ఇదే జిల్లాకు నియమించబడ్డారు.
The post కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు appeared first on Visalaandhra.
మురమండ, దుళ్ల కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మురమండ, దుళ్ల గ్రామ పంచాయతీలలో గ్రేడ్ 2 గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్న రావిపాటి సత్యనారాయణ, బిక్కి సత్యానందకుమార్ లకు గ్రేడ్-1 కార్యదర్శులుగా పదోన్నతులు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. జోన్ 2 పరిధిలో ఉన్న వీరిలో సత్యనారాయణ ను అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నియమించగా సత్యానంద కుమార్ ను తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్
The post కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు appeared first on Visalaandhra.
