Headlines

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నికకు

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నికకు అభిప్రాయ సేకరణ 

 విశాలాంధ్ర – కొవ్వూరు :  కొవ్వూరు కార్యకర్తల అభీష్టం మేరకే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం…తూర్పుగోదావరి జిల్లా అబ్జర్వర్ అధిత స్వప్న

కార్యకర్తల మనోభీస్టాన్ని తెలుసుకుని పార్టీ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థాగత నిర్మాణం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా పరిశీలకులు, జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే అధిత స్వప్న, ఏఐసీసీ కార్యదర్శి అంబా ప్రసాద్ లు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నికలలో బాగంగా మంగళవారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ఏఐసీసీ సభ్యురాలు అమర్ జహాబేగ్ స్వగృహంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక  కార్యకర్తల   అభిప్రాయం మేరకు జరుగుతుందన్నారు. పార్టీని నిలబెట్టింది కార్యకర్తలే అని, వారి అభిప్రాయాలకు విలువ ఉంటుందని, నిరభ్యంతరంగా వారి అభిప్రాయాలు తెలుపవచ్చన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో రాహూల్ గాంధీ ఆదేశాలతో పరిశీలకులుగా రావడం జరిగిందని, పార్టీ కోసం పనిచేస్తున్నామని భావిస్తే వారు నేరుగా తమ దరఖాస్తులను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి,  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ యూల్లా బేగ్ కొవ్వూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ మహమ్మద్ ఫసి ఉల్లా బేగ్  నిడదవోలు నియోజకవర్గ ఇంచార్జి మేడవరపు భద్రం దొర,  బచ్చు బుజ్జిబాబు, సుంకర వెంకటేశ్వర రావు, మట్టా సుబ్బారావు, గెల్లా భాస్కరరావు, పాలగుర్తి మణి, కార్యకర్తలు పాల్గొన్నారు

The post కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నికకు appeared first on Visalaandhra.

​కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నికకు అభిప్రాయ సేకరణ   విశాలాంధ్ర – కొవ్వూరు :  కొవ్వూరు కార్యకర్తల అభీష్టం మేరకే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం…తూర్పుగోదావరి జిల్లా అబ్జర్వర్ అధిత స్వప్న కార్యకర్తల మనోభీస్టాన్ని తెలుసుకుని పార్టీ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థాగత నిర్మాణం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా పరిశీలకులు, జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే అధిత స్వప్న, ఏఐసీసీ కార్యదర్శి అంబా ప్రసాద్ లు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల
The post కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నికకు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *