ఏపీఐఐసీ లో మార్గానికి కీలక బాధ్యతలు.
విశాలాంధ్ర – కడియం : ఏపిఐఐసి నూతన డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ కు కీలక బాధ్యతలు ఆప్పగిస్తామని సంస్థ చైర్మన్ మంతెన రామరాజు పేర్కొన్నారు. మండలంలోని కడియపులంక గ్రామానికి చెందిన సీనియర్ టీడిపి నాయకులు, ప్రముఖ నర్సరీ రైతు మార్గానీ సత్యనారాయణ బుధవారం మంగళగిరిలో డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రామరాజు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు తాము ఏర్పాటు చేయబోయే లేఅవుట్ల అభివృద్ధిలో పచ్చదనం, సుందరీకరణ ఎంతో ప్రాముఖ్యమైనవని వాటి బాధ్యత మార్గానికి అప్పచెప్తామని పేర్కొన్నారు. అలానే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ , రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి సత్య ప్రసాద్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లురవీంద్ర, ఆర్టీసీ చైర్మెన్ కొనగళ్ళ నారాయణ, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, మార్గానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి వెళ్ళిన పలువురు స్థానిక నాయకులు మార్గానిని ఘనంగా సత్కరించారు.
The post ఏపీఐఐసీ లో మార్గాని appeared first on Visalaandhra.
ఏపీఐఐసీ లో మార్గానికి కీలక బాధ్యతలు. విశాలాంధ్ర – కడియం : ఏపిఐఐసి నూతన డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ కు కీలక బాధ్యతలు ఆప్పగిస్తామని సంస్థ చైర్మన్ మంతెన రామరాజు పేర్కొన్నారు. మండలంలోని కడియపులంక గ్రామానికి చెందిన సీనియర్ టీడిపి నాయకులు, ప్రముఖ నర్సరీ రైతు మార్గానీ సత్యనారాయణ బుధవారం మంగళగిరిలో డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రామరాజు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు తాము ఏర్పాటు చేయబోయే లేఅవుట్ల అభివృద్ధిలో పచ్చదనం,
The post ఏపీఐఐసీ లో మార్గాని appeared first on Visalaandhra.
