Headlines

మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు

ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు
‘ఉమెన్‌ ఎంపవర్‌ మెంట్‌’ ఇంటి నుంచే మొదలు..: ‘వీ-ఎనేబుల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుక’లో మంత్రి శ్రీధర్‌బాబు

నవతెలంగాణ – బంజారాహిల్స్‌
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ‘వీ హబ్‌’ ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో నిర్వహించిన ‘వీ-ఎనేబుల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుక’లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యసాధనలో మహిళలను కీలక భాగస్వామ్యం చేస్తామన్నారు. మహిళా సాధికారత పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలు కావాలన్నారు. ఇప్పుడిప్పుడే సమాజంలో ప్రగతిశీల మార్పు కనిపిస్తోందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామని చెప్పారు. 2017-18 నుంచి 2023-24 మధ్య కాలంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 22 శాతం నుంచి 40.3 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.

తెలంగాణలో మహిళా శ్రామికశక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతం అని, ఇది జాతీయ సగటు 45.2 శాతం కంటే ఎక్కువగా నమోదు కావడం రాష్ట్ర పురోగతిని ప్రతిబింబిస్తోందన్నారు. మహిళలు కూడా పురుషులకు దీటుగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా నిర్వహించగలరని ‘వీ హబ్‌’ నిరూపించిందన్నారు. ఈ స్ఫూర్తితో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించే సార్టప్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఎంటర్‌ ప్రైజెస్‌గా మార్చేలా ‘వీ హబ్‌ 2.0’కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ వేదిక ద్వారా ఒకేచోట స్కిల్స్‌, టెక్నాలజీ, ఫైనాన్స్‌, మార్కెట్‌, మెంటార్షిప్‌ అందుబాటులో ఉండేలా ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తామన్నారు. మహిళల ఆలోచన తీరులోనూ మార్పు రావాలని, ఉద్యోగాల కోసం కాకుండా వాటిని సృష్టించేలా కొత్తగా ఆలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారిణి గుప్తా జ్వాల, ఫిలిం ప్రొడ్యూసర్‌ ప్రియాంక దత్‌, వీ హబ్‌ సీఈవో సీతా పల్లచోల్ల తదితరులు పాల్గొన్నారు.

The post మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు appeared first on Navatelangana.

​ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు‘ఉమెన్‌ ఎంపవర్‌ మెంట్‌’ ఇంటి నుంచే మొదలు..: ‘వీ-ఎనేబుల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుక’లో మంత్రి శ్రీధర్‌బాబు నవతెలంగాణ – బంజారాహిల్స్‌రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ‘వీ హబ్‌’ ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో నిర్వహించిన ‘వీ-ఎనేబుల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుక’లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా
The post మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *