కవ్వాల్ రిజర్వు ఫారెస్టులో 200 చెట్లను నరికిన ఆదివాసీలు
మంచిర్యాల జిల్లా, కవ్వాల్ రిజర్వు ఫారెస్టులోని పాలగోరి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఇతరులకు అనుమానం రాకుండా జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు సుమారు 200 వరకు చిన్నా, పెద్ద చెట్లను నరికివేశారు. చెట్లను విచ్చలవిడిగా నరుకుతున్నట్లు సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది నరికివేతను అడ్డుకోవడంతో ఆదివాసీలు అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఇందన్‌పల్లి రేంజ్ ఆఫీసర్ శ్రీధరాచారి తెలిపారు. చెట్లను నరికివేయకుండా ఎప్పటికప్పుడు రాత్రి, పడలు అనే తేడా లేకుండా తమ సిబ్బంది…
