Cyber Fraud : సైబర్ క్రైమ్ పోలీసుల దాడులు.. ట్రేడింగ్ మోసం నుంచి ఫెడెక్స్ ఫ్రాడ్ వరకు
Cyber Fraud : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వరుస దాడుల్లో పలు ఆన్‌లైన్ మోసగాళ్లను పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తూ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. తాజాగా పంజాబ్‌లో సంజీవ్ కుమార్ (49) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన IMPV PRO యాప్ ద్వారా ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసగట్టినట్లు బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన 69 ఏళ్ల పూజారి నుంచి ఆయన…
