AP Govt : నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్.. సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి లోకేశ్ భరోసా
AP Govt on Nepal protests : నేపాల్‌లో జెన్-జడ్ నిరసనలతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే నేపాల్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరోవైపు.. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ వాసుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాక.. ఆర్టీజీఎస్ లో ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది….
