విశాఖపట్నం , శ్రీసూర్య దృష్టి , సెప్టెంబర్ 20 :
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర జలాల పరిశుభ్రత ముగింపు కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో తేనీటి పార్కు వద్ద గల సముద్రందు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ మారుతి హరీష్ కుమార్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులగా మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ వారు ఎంపికచేసిన పలు సముద్ర ప్రాంతాల్లో పరిశుభ్రత మరియు చుట్ట్టు పక్కల ఉన్న ప్రజలకు, పర్యాటకులకు సముద్ర కాలుష్యం వల్ల వచ్చే అనర్థాల గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. సముద్రాలను పరిరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలు సముద్రంలో కలవడం వలన జలాలు కలుషితం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనర్ రోవర్స్ సి హచ్ దేశాయ్, జిల్లా సహాయ కార్యదర్శి జి. సంధ్య రాణి, జిల్లా ట్రైనింగ్ కౌన్సిలర్ గుండి. జానకి రాము, జిల్లా యూత్ చైర్ పర్సన్ పి. కిషన్ కుమార్, స్కౌట్ మాస్టర్ ఎస్. వెంకటేశ్, గైడ్ కెప్టెన్లు సి హెచ్ శిరీష కుమారి, ఎం. శారద మరియు డి ఏ వి పబ్లిక్ స్కూల్, సుజాత నాగర్ మరియు వివేకానంద విద్యానిలయం కంచరపాలెం నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో సముద్ర జలాల పరిశుభ్రత ముగింపు కార్యక్రమం
స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో సముద్ర జలాల పరిశుభ్రత ముగింపు కార్యక్రమం
