Headlines

బ్యాడ్మింటన్‌ చాంప్‌ ఆనన్య జోడీ

హైదరాబాద్‌ : వేమూరి సుధాకర్‌ స్మారక తెలంగాణ సబ్‌ జూనియర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ బాలికల డబుల్స్‌ అండర్‌-17 విభాగంలో ఆనన్య రెడ్డి-చంద్రిక జోడీ విజేతగా నిలిచారు. మంగళవారం మొయినాబాద్‌లోని గుత్తా జ్వాల అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో అండర్‌-17 ఫైనల్లో ఆనన్య-చంద్రిక (గేమ్‌పాయింట్‌ అకాడమీ) జోడీ 15-13, 15-8తో అదితి-లక్ష్య (జ్వాల అకాడమీ)పై గెలిచి టైటిల్‌ దక్కించుకున్నారు. బాలుర డబుల్స్‌లో గౌతం-హర్ష ద్వయం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మహిధర్‌-గ్రేస్‌ జంట, సింగిల్స్‌లో అఖిలేష్‌, మహిళల సింగిల్స్‌ మాన్య టైటిళ్లు సాధించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, ద్రోణాచార్య పురస్కార గ్రహీత ఎస్‌.ఎం ఆరీఫ్‌, దిగ్గజ షట్లర్‌ గుత్తా జ్వాల విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు.

The post బ్యాడ్మింటన్‌ చాంప్‌ ఆనన్య జోడీ appeared first on Navatelangana.

​హైదరాబాద్‌ : వేమూరి సుధాకర్‌ స్మారక తెలంగాణ సబ్‌ జూనియర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ బాలికల డబుల్స్‌ అండర్‌-17 విభాగంలో ఆనన్య రెడ్డి-చంద్రిక జోడీ విజేతగా నిలిచారు. మంగళవారం మొయినాబాద్‌లోని గుత్తా జ్వాల అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో అండర్‌-17 ఫైనల్లో ఆనన్య-చంద్రిక (గేమ్‌పాయింట్‌ అకాడమీ) జోడీ 15-13, 15-8తో అదితి-లక్ష్య (జ్వాల అకాడమీ)పై గెలిచి టైటిల్‌ దక్కించుకున్నారు. బాలుర డబుల్స్‌లో గౌతం-హర్ష ద్వయం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మహిధర్‌-గ్రేస్‌ జంట, సింగిల్స్‌లో అఖిలేష్‌, మహిళల సింగిల్స్‌ మాన్య
The post బ్యాడ్మింటన్‌ చాంప్‌ ఆనన్య జోడీ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *