Headlines

వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు

న్యూఢిల్లీ: దసరా పండగ ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాకిచ్చాయి. బుధవారం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరపై రూ.15.50 పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,595.50కి చేరుకుంది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వస్తాయని తెలిపాయి. దీంతో హోటళ్ళు, రెస్టారెంట్లు, వాణిజ్య వంట గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడే పలు వ్యాపారాలపై ప్రభావం పడనుంది. ఇక, గృహ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాణిజ్య రేట్లలో పెరుగుదల సర్దుబాటు ఉన్నప్పటికీ 14.2 కిలోల దేశీయ LPG సిలిండర్ల ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి.

​దసరా పండగ ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాకిచ్చాయి. బుధవారం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *