చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవర ప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. శశిరేఖగా నయనతారను పరిచయం చేస్తూ మేకర్స్ బుధవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పసుపు రంగు చీరలో మెరిసిపోతూ కనిపించిన ఆమె లుక్ అదిరిపోయింది.
ముత్యాల హారం, సంప్రదాయ గాజులతో, చేతిలో నలుపు రంగు హ్యాండిల్‌తో ఉన్న గొడుగును పట్టుకొని, ఫెస్టివల్ వైబ్‌లో కనిపించిన ఈ లుక్ శశిరేఖ పాత్రకు గొప్ప సొగసుని తీసుకొచ్చింది. నయనతార పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మొదటి నుంచే చురుకుగా పాల్గొంటున్నారు. విజయదశమి శుభసందర్భంగా ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్‌ను అనౌన్స్ చేస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
The post శశిరేఖగా నయనతార appeared first on Navatelangana.
చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవర ప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. శశిరేఖగా నయనతారను పరిచయం చేస్తూ మేకర్స్ బుధవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పసుపు రంగు చీరలో మెరిసిపోతూ కనిపించిన ఆమె లుక్ అదిరిపోయింది. ముత్యాల హారం, సంప్రదాయ గాజులతో, చేతిలో
The post శశిరేఖగా నయనతార appeared first on Navatelangana.
