Headlines

Today Gold Price : దూసుకెళ్తున్న పసిడి.. తులం బంగారం రూ.2లక్షలు ఖాయం..! ఇవాళ గోల్డ్ రేటు ఎంత పెరిగిందో తెలిస్తే.. షాకవ్వాల్సిందే..

Today Gold Price

Today Gold Price : పసిడి ధర పరుగులు పెడుతోంది.. గడిచిన వారం రోజులుగా రాకెట్ వేగంతో బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఫలితంగా గోల్డ్ రేటు ఆల్‌టైం రికార్డులను నమోదు చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి 10గ్రాముల 24క్యారట్ల బంగారం రేటు రూ. 2లక్షలు చేరే అవకాశాలు ఉన్నాయి.

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌, వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా సురక్షితమైన బంగారంకు డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం రేటు ఆల్‌టైం రికార్డులు నమోదు చేస్తుంది. గడిచిన వారం రోజుల్లో 10గ్రాముల బంగారంపై సుమారు రూ. 4వేలు పెరిగింది. బుధవారం కూడా గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది.

ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,200 పెరగ్గా.. 22క్యారట్ల బంగారంపై రూ. 1,100 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. తాజాగా.. ఔన్సు గోల్డ్‌పై 22 డాలర్లు పెరిగి.. 3867 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వెండి ధర తగ్గింది. గడిచిన తొమ్మిది రోజులుగా పెరుగుకుంటూ వస్తున్న వెండి రేటు ఇవాళ కాస్త శాంతించింది. ఇవాళ ఉదయం కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. అయితే, సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కిలో వెండిపై రూ. 16వేలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,08,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,18,640కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,18,790కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,08,750 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,18,640కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,60,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,50,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,60,000కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Also Read: October New Rules : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.. LPG, UPI నుంచి రైల్వే టికెట్ బుకింగ్ వరకు.. కీలక మార్పుల ఫుల్ లిస్ట్ మీకోసం..

​Today Gold Price : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *