విత్తమంత్రి విశాల హృదయానికి
వీర విధేయుల వీరంగ విన్యాసాలు
బాజా భజంత్రీల భక్తాందులు
బ్రహ్మాండమంటూ భజనలు చేస్తున్నారు
భళాభళి అంటూ బాకాలు ఊదుతున్నారు
గాట్లు పడేటట్లు గుండు కొట్టి
గాయపడ్డ గుండుకు గంధం పూస్తే
గప గప మంటున్న గాట్లు గుర్తుండవా?
అట్టలూడేల వాతలు వేసి హాయిగా ఉంటుందని మలాం రాస్తే
మనసులో ఉన్న మంట తగ్గుతుందా?
ఏడు ఎనిమిది ఏండ్ల ఎటమటం పనికి
సెప్టెంబర్ ఇరవైరెండు నుండి సెలవంటే
చంకలు గుద్దుకోవాలో సంబురాలు చేసుకోవాలో
అర్థశాస్త్రం అర్థం కాక ఆగమాగం అవుతున్నాం.
- డా.ఎడ్ల కల్లేశ్, 9866765126
The post అర్థం కాని అర్థశాస్త్రం appeared first on Navatelangana.
విత్తమంత్రి విశాల హృదయానికివీర విధేయుల వీరంగ విన్యాసాలుబాజా భజంత్రీల భక్తాందులుబ్రహ్మాండమంటూ భజనలు చేస్తున్నారుభళాభళి అంటూ బాకాలు ఊదుతున్నారుగాట్లు పడేటట్లు గుండు కొట్టిగాయపడ్డ గుండుకు గంధం పూస్తేగప గప మంటున్న గాట్లు గుర్తుండవా?అట్టలూడేల వాతలు వేసి హాయిగా ఉంటుందని మలాం రాస్తేమనసులో ఉన్న మంట తగ్గుతుందా?ఏడు ఎనిమిది ఏండ్ల ఎటమటం పనికిసెప్టెంబర్ ఇరవైరెండు నుండి సెలవంటేచంకలు గుద్దుకోవాలో సంబురాలు చేసుకోవాలోఅర్థశాస్త్రం అర్థం కాక ఆగమాగం అవుతున్నాం.
The post అర్థం కాని అర్థశాస్త్రం appeared first on Navatelangana.
