Headlines

కరూర్‌ తొక్కిసలాటలో ప్రచారరథం సీజ్‌

డ్రైవర్‌పై కేసు నమోదు
చెన్నై: కరూర్‌ తొక్కిసలాట ఘటనకు ముందు టీవీకే చీఫ్‌ , నటుడు విజయ్ ప్రచారరథం ఇద్దరు యువకులను ఢీకొీట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రచారరథాన్ని సీజ్‌ చేశారు. ఆ వాహనం నడిపిన డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ఇటీవల తమిళనాడులోని కరూర్‌ జిల్లాలో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే ఈ ఘటనలో ఏకంగా 41 మంది మరణించారు. 80 మందికిపైగా గాయపడిన విషయం విదితమే. ఇదిలావుంటే ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో పోలీసులు మరో కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్‌ చేశారు.

The post కరూర్‌ తొక్కిసలాటలో ప్రచారరథం సీజ్‌ appeared first on Navatelangana.

​డ్రైవర్‌పై కేసు నమోదుచెన్నై: కరూర్‌ తొక్కిసలాట ఘటనకు ముందు టీవీకే చీఫ్‌ , నటుడు విజయ్ ప్రచారరథం ఇద్దరు యువకులను ఢీకొీట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రచారరథాన్ని సీజ్‌ చేశారు. ఆ వాహనం నడిపిన డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ఇటీవల తమిళనాడులోని కరూర్‌ జిల్లాలో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా
The post కరూర్‌ తొక్కిసలాటలో ప్రచారరథం సీజ్‌ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *