ఇద్దరికి గాయాలు
2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొీన్నాయి. ముందు వెళ్తున్న కారు ఆకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనకున్న కార్లు ఒకదానికొకటి ఢీకొీన్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న ఎస్ క్రాస్ కారు డ్రైవర్ హిమాయత్‌సాగర్ వద్దకు రాగానే ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఇది గమనించని వెనక వచ్చిన మరో 5 వాహనాలు ఒకదానికొకటి ఢకొీట్టాయి. దాంతో ఆరు కార్ల ముందు భాగం ధ్వంసం అయ్యాయి. కార్లలో ఉన్న ఎయిర్ బెలూన్ ఓపెన్ అవ్వడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఔటర్ రింగ్‌రోడ్డుపై 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. మొదటి కారు వ్యక్తి సడన్ బ్రేక్ వేయడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు.
The post హిమాయత్‌సాగర్ ఓఆర్ఆర్పై ఆరు కార్లు ఢీ appeared first on Navatelangana.
ఇద్దరికి గాయాలు2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ నవతెలంగాణ-రాజేంద్రనగర్హిమాయత్సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొీన్నాయి. ముందు వెళ్తున్న కారు ఆకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనకున్న కార్లు ఒకదానికొకటి ఢీకొీన్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న ఎస్ క్రాస్ కారు డ్రైవర్ హిమాయత్‌సాగర్ వద్దకు రాగానే ఒక్కసారిగా
The post హిమాయత్‌సాగర్ ఓఆర్ఆర్పై ఆరు కార్లు ఢీ appeared first on Navatelangana.
